OTT Movie : కుటుంబ కథా చిత్రాలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా, మంచి ఫీలింగ్స్ ని కూడా ఇస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం ఫ్యామిలీ డ్రామా సినిమాలో, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్ లలో, మనల్ని మనమే ఊహించుకుంటాం. ఇంత చక్కని ఫ్యామిలీ డ్రామా మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘హోమ్‘ (Home). ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇంద్రన్స్, మంజు పిళ్లై, శ్రీనాథ్ భాసి, నస్లెన్ కె. గఫూర్, దీపా థామస్, జానీ ఆంటోనీ, కైనకరి థంకరాజ్ నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2023లో, ఈ మూవీ మలయాళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒలివర్ తన భార్య, ఇద్దరు కొడుకులు ఆంటోనీ,చార్లెస్ తో చాలా సంతోషంగా ఉంటాడు. ఆంటోనీ దర్శకుడుగా ఒక మూవీ చేసి ఉంటాడు. మరో మూవీ కథ రాసి, ప్రొడ్యూసర్ కి చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలోనే సిటీ నుంచి ఇంటికి వస్తాడు ఆంటోనీ. ఇంతలోనే చిన్న కొడుకు చార్లెస్ వలన ఫిష్ అక్వేరియం ప్రమాదవశాత్తు పగిలిపోతుంది. చార్లెస్ అన్నిటినీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం కూడా తండ్రి కన్నా ముందే అందరికీ తెలిసిపోతుంది. ఒలివర్ ఇదంతా ఫోన్ వల్ల జరిగిందని తెలుసుకొని, ఒక ఫోన్ కొనాలని అనుకుంటాడు. ఇంతలో కొడుకు యాంటోని, ప్రొడ్యూసర్ కి కథ చెప్తాడు. అయితే ప్రొడ్యూసర్ కథ ఇంకా బాగా రాయాలని ఆంటోనీకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ కోపంలో తండ్రిని చులకనగా మాట్లాడుతాడు ఆంటోనీ. ఈ విషయం తన ఫ్రెండ్ తో చెప్పుకొని బాధపడతాడు ఒలివర్. ఒకరోజు కొడుకు స్మార్ట్ ఫోన్ చూస్తుండగా, అది తన కోసమే కొనడానికి చూస్తున్నాడని అనుకుంటాడు ఒలివర్. అయితే తన గర్ల్ ఫ్రెండ్ తండ్రికి గిఫ్ట్ పంపుతున్నట్లు వీడియో కాల్ లో ఆంటోనీ మాట్లాడుతుంటాడు. ఇది చూసి తండ్రి బాధపడతాడు.
ఆ తర్వాత అంటోనీ ఇంటికి కొన్ని గిఫ్ట్స్ తన ఫ్యామిలీకి తెప్పిస్తాడు. వాటిలో తండ్రి కోసం ఫోన్ కూడా తెప్పించి ఉంటాడు. ఈ సీన్ కాస్త ఎమోషనల్ గానే ఉంటుంది. అయితే స్టోరీ నచ్చకపోవడంతో వెళ్లిపోయిన ఆ ప్రొడ్యూసర్ ని నానా మాటలు తిడతాడు. ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియని ఒలీవర్ ఫేస్బుక్లో, ఆంటోనీ తిట్టే మాటలు రికార్డు అయిపోతాయి. ఆ వీడియొ వైరల్ అవ్వడంతో, ఆంటోనీకి వచ్చే అవకాశం కూడా పోతుంది. తన వల్లే కొడుక్కి అవకాశాలు పోయాయాని తండ్రి బాధపడతాడు. అయితే తండ్రి గొప్పతనాన్ని తెలుసుకునే ఒకరోజు ఆంటోనీకి వస్తుంది. ఆరోజు తన తండ్రి ఎంత గొప్పవాడో తెలుసుకొని, ఆంటోనీ ఆనందపడతాడు. చివరికి ఆంటోనీ తెలుసుకున్న విషయం ఏమిటి? ఆంటోనీకి మళ్ళీ అవకాశాలు వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘హోమ్’ (Home) మూవీని మిస్ కాకుండా చూడండి.