BigTV English

OTT Movie : నవ్వుతోనే చంపేసే సైకో కిల్లర్… మతిమరుపు పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్… ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్

OTT Movie : నవ్వుతోనే చంపేసే సైకో కిల్లర్… మతిమరుపు పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్… ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే ఉంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు హిందీ భాషలలో వస్తున్న ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది స్మైల్ మాన్‘ (The smile man). అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక పోలీస్ అధికారి, తన జ్ఞాపకశక్తిని కోల్పోకముందే పరారీలో ఉన్న సీరియల్ కిల్లర్ కేసును ఛేదించడానికి సిద్ధపడతాడు. శరత్ కుమార్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చిదంబరం ఒక కారు ప్రమాదంలో చాలా రోజులు హాస్పిటల్ లోనే ఉంటాడు. ఇతనికి సంవత్సరం వరకే జ్ఞాపకశక్తి ఉండే అవకాశం ఉంటుందని డాక్టర్లు చిదంబరంకి చెబుతారు. ఈ సంవత్సరంలో మిగిలిపోయిన పనులు చేయాలని అనుకుంటాడుచిదంబరం. ఇతని దగ్గరికి అరవింద్ అనే మరొక ఆఫీసర్ వస్తాడు. ఐదు సంవత్సరాల క్రితం ఒక సైకో కిల్లర్ ని పట్టుకునే క్రమంలో అరవింద్ తండ్రి కనిపించకుండా పోయి ఉంటాడు. అయితే అతని తండ్రి, ఆ సైకో కిల్లర్ని ఎన్కౌంటర్ చేసి ఉంటాడు. ఈ కేసును అప్పుడు చిదాంబరం ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు. ప్రమాదం నుంచి కోలుకున్న చిదంబరంని, తండ్రి జాడ ఏమైనా మీకు తెలుసా అని అడుగుతాడు అరవింద్. ఆ సైకో కిల్లర్ ఏమైనా చేశాడేమో అని అనుమాన పడతాడు చిదంబరం. అందుకు అరవింద్ అతన్ని మా నాన్న ఎన్కౌంటర్ చేశాడు కదా అని అడుగుతాడు. ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అన్ని తెలుస్తాయని చిదంబరం చెబుతాడు.

ఎందుకంటే రీసెంట్ గా ఒక సైకో ఐదు సంవత్సరాల క్రితం మనుషులను ఎలా చంపి ఉంటాడో, ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని అలానే చంపి ఉంటాడు. అందుకు సైకో కిల్లర్ ఇంకా బతికే ఉన్నాడని చిదంబరం అనుమానిస్తాడు. నిజానికి ఆ సైకో కిల్లర్ని అరవింద తండ్రి చంపి ఉండడు. కేసుని సాల్వ్ చేయలేక, ఒక అమాయకున్ని నకిలీ ఎన్కౌంటర్ చేసి సైకోని చంపేశానని అందరినీ నమ్మిస్తాడు. ఆ తర్వాత అతను కూడా కనిపించకుండా పోతాడు. ఈ విషయం అప్పుడే చిదంబరం కనిపెడతాడు. ఆ తర్వాత ఆక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్లోనే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది. చివరికి చిదంబరం ఆ సైకో కిల్లర్ని పట్టుకుంటాడా? సైకో కిల్లర్ మరిన్ని హత్యలు చేస్తాడా? అరవింద తండ్రి ఎలా మిస్ అయ్యాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ది స్మైల్ మాన్’ (The smile man) క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×