E-Paper
Advertisement

దెయ్యాల కొంపలో దాచిన శవం…ఇండోనేషియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన హారర్ కామెడీ

దెయ్యాల కొంపలో దాచిన శవం…ఇండోనేషియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన హారర్ కామెడీ
Advertisement

Horror Comedy OTT : ఇండోనేషియా హారర్ అంటే ఆమడ దూరం పరిగెత్తాల్సిందే. అంతలా భయపెడుతుంటాయి. అయితే వీళ్ళు హారర్ కామెడీని కూడా ఓ రేంజ్ లో తీస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 లో వచ్చిన ‘అగాక్ లేన్ (Agak Laen) అనే కామెడీ హారర్ సినిమా, ఇండోనేషియాలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. నలుగురు కామెడీ పాత్రలతో తీసిన పక్కా హారర్ కామెడీ ఇది. ఒకపక్క దయ్యం కనిపిస్తూ భయపెడుతుంటేనే, మరోపక్క ఆ సిట్యుయేషన్స్ చూసి మనకు కడుపుబ్బ నవ్వు వస్తుంది. సినిమా అంతా బ్లాక్ కామెడీ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక మనిషి చనిపోయిన సీరియస్ విషయాన్ని కూడా చాలా ఫన్నీగా చూపిస్తారు. శవాన్ని దాచడానికి ఆ నలుగురు పడే పాట్లు, దయ్యం చేసే అల్లరి మనల్ని భలే ఎంటర్టైన్ చేస్తాయి. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక క్రేజీ మూవీ.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్

ముహద్‌క్లీ అచో దర్శకత్వం వహించిన ‘అగాక్ లేన్ (Agak Laen) సినిమా నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. బెనే డియోన్, బోరిస్ బోకిర్, ఇంద్ర జెగెల్, ఓకీ రెంగా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండోనేషియా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో దుమ్ములేపింది. కేవలం నెల రోజుల్లోనే కోట్లాది రూపాయల వసూళ్లు రాబట్టి, ఆ దేశంలోనే అత్యధిక జనాలు చూసిన రెండో సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. విచిత్రం ఏంటంటే, ఇందులో నటించిన నలుగురు హీరోలు మామూలు హీరోలు కాదు; వాళ్లు ‘అగాక్ లేన్’ అనే పాడ్‌కాస్ట్ ద్వారా పాపులర్ అయిన కామెడీ గ్యాంగ్. వాళ్ళ రియల్ లైఫ్ దోస్తీ, కామెడీ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేశాయి. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి 2025లో Agak Laen: Menyala Pantiku అనే సీక్వెల్ కూడా తీశారు, అది కూడా రికార్డులు తిరగరాసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు కామెడీ సినిమాలను ఇష్టపడితే, సబ్‌టైటిల్స్ పెట్టుకుని మరీ చూడాల్సిన క్రేజీ మూవీ ఇది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళకి పెద్దగా పనేం ఉండదు కానీ, ఎట్లైనా సరే పైసలు సంపాదించాలని ఒక పాత జాతరలో ‘దయ్యాల కొంప’ (Haunted House) సెట్ వేస్తారు. కానీ వీళ్ళు వేసే వేషాలు చూసి ఎవడికీ భయం వేయదు సరికదా, వచ్చే జనాలు వీళ్ళను చూసి నవ్వుకుంటారు. గిరాకీ లేక మొహాలు వేలాడేసుకున్న టైంలో, సీన్ రివర్స్ అవుతదని వాళ్ళు అస్సలు అనుకోరు. ఒకరోజు ఆ దయ్యాల కొంపలోకి ఒక పెద్ద మనిషి వస్తాడు. వీళ్ళు చేసే హడావుడికి ఆ ముసలోడు భయపడి గుండె ఆగి అక్కడికక్కడే ఖతమ్ అయిపోతాడు. పోలీసులు వస్తే లోపలికి తోస్తారని భయపడి, ఆ నలుగురు తెలివిగా ఆ శవాన్ని అక్కడే పాతిపెట్టేస్తారు.

కానీ ఆశ్చర్యమేంటంటే.. ఆ చచ్చినోడి ఆత్మ నిజంగానే అక్కడ తిరగడం మొదలుపెడుతుంది. గూబ గుయ్ మనేలా ఆ దయ్యం చేసే అల్లరికి జనాల ప్యాంట్లు తడిచిపోతుంటాయి. నిజమైన దయ్యం ఉందని తెలియని జనాలు, అమ్మో! ఈ దయ్యాల కొంప మామూలుగా లేదురా నాయనో అని ఎగబడి వస్తారు. వీళ్ళకి పైసలు కుప్పలు తెప్పలుగా పడతాయి కానీ, ఇంకో పక్క పోలీసులు ఆ ముసలోడు ఏమయ్యాడని ఎంక్వయిరీ మొదలుపెడతారు. దయ్యం చేసే టార్చర్, పోలీసుల భయం మధ్య ఆ నలుగురు ఆ శవాన్ని ఎలా దాచారు, ఆ పీడకల నుండి ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా అసలు కథ.

Advertisement

Read Also : బ్లాక్ మెయిల్ ఉచ్చులో వయ్యారి భామ… ఆటాడేసుకునే అపరిచితుడు… మైండ్ గల్లంతయ్యే క్లైమాక్స్

Tags

Related News

గర్ల్ ఫ్రెండ్ కోసం కుక్కను తెచ్చి కొత్త చిక్కుల్లో… డాగ్ లవర్స్ డోంట్ మిస్

ఒకరి తర్వాత ఒకరు సైకోలుగా మారి హత్యలు చేసే పేరున్న వ్యక్తులు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

యాక్సిడెంట్, కట్ చేస్తే ప్రేమించిన అమ్మాయి భార్యగా… మెంటలెక్కించే తమిళ సై-ఫై రొమాంటిక్ థ్రిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

50 రోజులు అందమైన అమ్మాయితో గదిలో కాలు బయట పెట్టకుండా… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీ

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×