E-Paper
Advertisement

ప్రేమ పెళ్ళిలో గందరగోళం… నవ్వించి చంపే పిచ్చి దెయ్యం…. సరికొత్త ఇండోనేషియన్ హారర్ కామెడీ

ప్రేమ పెళ్ళిలో గందరగోళం… నవ్వించి చంపే పిచ్చి దెయ్యం…. సరికొత్త ఇండోనేషియన్ హారర్ కామెడీ
Advertisement

Horror Comedy OTT : ఇండోనేషియన్ హారర్ సినిమాలు వెన్నులోనే కాదు, బాడి మొత్తం వణికించేస్తాయి. అయితే ఇక్కడి నుంచి అంతకు మించిన కామెడీ హారర్ సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక వీటిని చూస్తే నవ్వు ఆపడం అస్సలు కుదరదు. కడుపు నొప్పి కచ్చితంగా వస్తుంది నవ్వి నవ్వి. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ఒకవైపు దెయ్యం కనిపిస్తూ భయపెడుతున్నా, వెంటనే కొన్ని పాత్రలు చేసే పిచ్చి పనుల వల్ల మనకు విపరీతమైన నవ్వు వస్తుంది. మన తెలుగులో ‘ప్రేమకథా చిత్రమ్’ లాంటి సినిమాలు ఎలా ఉంటాయో, ఇది కూడా అదే స్టైల్‌లో భయం, నవ్వులతో కలిపి సాగుతుంది. సీరియస్ హారర్ సినిమా చూడాలనుకునే వారి కంటే, సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ కావడం వల్ల మనకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో చూసినా, ఫ్రెండ్స్‌తో చూసినా ఎంజాయ్ చేయడం పక్కా.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ హారర్ కామెడీ సినిమా పేరు ‘కాంగ్ సోలా ఫ్రమ్ కాంగ్ మాక్ x నేనెక్ గాయుంగ్’ (Kang Solah from Kang Mak x Nenek Gayung). ఈ సినిమా ఇండోనేషియాలో ఒక వినూత్నమైన స్టైల్ లో ఉంటుంది. హాలీవుడ్‌లో ‘మార్వెల్’ సినిమాలు ఎలాగో, వీళ్లు కూడా దీనిని ఇలాంటి ‘హారర్-కామెడీ యూనివర్స్’ని క్రియేట్ చేస్తున్నారు. ఇందులో నటించిన రిజెన్ రాకెల్నా, ఇంద్ర జెగెల్ వంటి వాళ్ళు ఇండోనేషియాలో ఫేమస్ స్టాండప్ కమెడియన్స్. అందుకే సినిమాలో పంచ్‌ డైలాగులు చాలా బాగా ఉంటాయి. మన తెలుగులో ‘జాతి రత్నాలు’, ‘డీజే టిల్లు’ టైపులో బాడీ లాంగ్వేజ్‌తోనే నవ్విస్తారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఇది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లోకి వచ్చేసింది. మీరు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే మీ మొబైల్‌లో టీవీలో నేరుగా ఈ హారర్ కామెడీని చూసి ఎంజాయ్ చేయవచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సోలా అనే కుర్రాడు ఆర్మీలో ఉద్యోగం చేసి, ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్దామా అని తెగ ఆశగా వస్తాడు. ఊర్లోకి అడుగుపెట్టగానే అందరూ హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతారనుకుంటే, సీన్ రివర్స్ అవుద్ది. వీడిని చూసి ఊరోళ్లంతా దెయ్యం.. దెయ్యం.. అంటూ పారిపోతుంటారు. వాడు మనిషేనని ఎంత మొత్తుకున్నా ఎవడూ నమ్మడు. దానికి తోడు వాడు ప్రాణంగా ప్రేమించిన దార అనే పిల్లేమో, వీడి తమ్ముడినే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి వీడికి పెద్ద షాక్ ఇస్తుంది. ఇది చాలదన్నట్టు, అదే టైంలో ఊర్లోకి నేనెక్ గాయుంగ్ అనే ఒక ముసలి దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఆ దెయ్యం చేతిలో ఒక మగ్గు ఉంటుంది. దాంతో ఎవరికైనా స్నానం చేయించిందంటే ఇక వాళ్లు గోవిందా! ఆ ముసలి దెయ్యం ఊర్లో ఉన్న కుర్రాళ్ల మీద కన్నేసి నానా రచ్చ చేస్తూ అందరినీ వణికిస్తుంటుంది. ఒకపక్క ప్రేమ పోయి, మరోపక్క ఊరోళ్లు దెయ్యం అని తరుముతుంటే సోలా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారవుతుంది. చివరికి సోలా తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ ముసలి దెయ్యాన్ని ఎలా తరిమికొట్టాడు ? తన ప్రేమని ఎలా కాపాడుకున్నాడు ?అనేదే అసలు మజా ఇచ్చే క్లైమాక్స్.

Read Also : పిచ్చెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్… గురువును మించిన శిష్యురాలు… ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×