BigTV English

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు తమ టెన్షన్, సస్పెన్స్, కాంప్లెక్స్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డైనమిక్స్, సీరియల్ కిల్లర్ థీమ్స్‌తో ఉండే సినిమాల గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. 2009లో రిలీజైన ఒక గ్రిప్పింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.


స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో ?

ఈ మూవీ పేరు The Stepfather (2009). నెల్సన్ మెక్‌కార్మిక్ దర్శకత్వంలో, స్క్రీన్ జెమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2009 అక్టోబర్ 16న USలో రిలీజైంది. 1987 క్లాసిక్ రీమేక్‌గా రూపొందిన ఈ అమెరికన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ట్యూబీ, ప్లెక్స్, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. డిలాన్ వాల్ష్ (డేవిడ్ హారిస్/గ్రాడీ ఎడ్వర్డ్స్), సెలా వార్డ్ (సుసాన్ మైన్), పెన్ బ్యాడ్గ్లీ (మైఖేల్ హార్డింగ్), అంబర్ హర్డ్ (కెల్లీ పోర్టర్), పైజ్ టర్కో (జాకీ కెర్న్స్), షెరీ స్ట్రింగ్‌ఫీల్డ్ (లెస్లీ స్టార్క్) ఇందులో నటించారు. ఈ సినిమా $20 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కగా, $31.2 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇందులో గ్రాఫిక్ వయోలెన్స్, సీరియల్ కిల్లింగ్, సైకలాజికల్ టెన్షన్‌ తో నడుస్తుంది. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు జాగ్రత్తగా చూడాలి.

స్టోరీలోకి వెళ్తే… 

సినిమా డేవిడ్ హారిస్ (డిలాన్ వాల్ష్) చుట్టూ తిరుగుతుంది. చార్మింగ్, కేరింగ్ గా ఉండే ఈ వ్యక్తి వాస్తవానికి ఒక సీరియల్ కిల్లర్. గ్రాడీ ఎడ్వర్డ్స్ తన గత ఐడెంటిటీస్‌ను వదిలేసి, కొత్త ఫ్యామిలీలలో చొరబడతాడు. సినిమా ఓపెనింగ్‌లో గ్రాడీ తన మాజీ ఫ్యామిలీని క్రూరంగా చంపి, కొత్త ఐడెంటిటీతో పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌కు మూవ్ అవుతాడు. అక్కడ అతను సుసాన్ మైన్ (సెలా వార్డ్) అనే డివోర్సీ, సింగిల్ మదర్‌ను కలుస్తాడు. ఆమెను తన చార్మ్‌తో ఆకర్షిస్తాడు. సుసాన్‌కు ముగ్గురు పిల్లలు ఉంటారు. వారిలో ఒకడు మైఖేల్ హార్డింగ్ (పెన్ బ్యాడ్గ్లీ) అనే 17 ఏళ్ల టీనేజర్ ఉంటాడు. మిలిటరీ స్కూల్ నుండి తిరిగి వస్తాడు.


డేవిడ్ సుసాన్‌తో ఎంగేజ్ అవుతాడు. ఆమె ఫ్యామిలీలో స్టెప్‌ఫాదర్‌గా జాయిన్ అవుతాడు. కానీ అతని పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఇమేజ్‌ను డిమాండ్ చేసే సైకోపాతిక్ టెండెన్సీస్ బయటపడతాయి. డేవిడ్ బిహేవియర్‌పై మైఖేల్ అనుమానం పెంచుకుంటాడు. ముఖ్యంగా అతని విచిత్రమైన స్టోరీలు, గతం గురించి డీటెయిల్స్ లేకపోవడం అనుమానాలకు తెర తీస్తాయి. మైఖేల్ తన గర్ల్‌ఫ్రెండ్ కెల్లీ (అంబర్ హర్డ్)తో కలిసి డేవిడ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. అదే సమయంలో సుసాన్ సిస్టర్ జాకీ (పైజ్ టర్కో), డేవిడ్ గత ఫ్యామిలీ మర్డర్స్ గురించి వార్తలు చూసి, అతని ఐడెంటిటీ గురించి సందేహిస్తుంది. డేవిడ్ డార్క్ సీక్రెట్స్ బయటపడుతున్న కొద్దీ… అతను తన సీక్రెట్స్ ను కాపాడుకోవడానికి మరింత డేంజరస్ అవుతాడు. సుసాన్ ఫ్యామిలీపై దాడి చేస్తాడు. క్లైమాక్స్ ఇంటెన్స్ ట్విస్ట్ వస్తుంది. ఇక్కడ మైఖేల్, సుసాన్ డేవిడ్‌ ను ఎదుర్కొంటారు. డేవిడ్ హౌస్ రూఫ్‌పై నుండి పడి, కోమాలోకి వెళ్తాడు. కానీ సినిమా ఊహించని ఎండింగ్‌తో ముగుస్తుంది.

Read Also : పెళ్ళైనా తీరని కోరిక… భార్యాభర్తలిద్దరిదీ అదే పరిస్థితి… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Related News

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

OTT Movie : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి హత్య చేసే కిల్లర్… 6 నెలల తరువాత ఓటీటీలోకి… కానీ చిన్న ట్విస్ట్

OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సినిమాల సందడి..మూవీ లవర్స్ కు పండగే..!

OTT Movie : కళ్ళు కన్పించని కన్నిబలిస్టిక్ జీవులు… ట్రిప్పుకెళ్లి అడ్డంగా బుక్కయ్యే గ్రూప్… ఒళ్ళు జలదరించే సీన్స్

OTT Movie : కాబోయే భర్తను చంపే పెళ్లికూతురు… పెళ్లికి ముందే దెయ్యం పట్టి పిచ్చి పనులు… కలలోనూ వెంటాడే సీన్స్

OTT Movie : అమ్మాయికి వింత జబ్బు… పనిష్మెంట్ పేరుతో ఆఫీసర్ అరాచకం… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

Big Stories

×