BigTV English

HCU : ఫేక్ వీడియోలపై హైకోర్టులో పిటిషన్.. కేటీఆర్ చిక్కేనా?

HCU : ఫేక్ వీడియోలపై హైకోర్టులో పిటిషన్.. కేటీఆర్ చిక్కేనా?

HCU : అంతా ఫేక్. అంతా ఏఐ జనరేటెడ్. నెమళ్లు ఎగరడం ఫేక్. నెమలి అరవడం ఫేక్. జింకలు ఫేక్. జింకలు భయంతో పరుగెత్తడం ఫేక్. అడవి వీడి జనావాసాల్లోకి జింకలు రావడం ఫేక్. కంచ గచ్చిబౌలి భూముల ఎపిసోడ్‌లో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు, వీడియోలు చాలా వరకు ఫేక్ ఫేక్ ఫేక్.


హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

మార్ఫింగ్ వీడియోలు, ఏఐ జనరేటెడ్ ఫోటోలతో HCU వివాదానికి లింక్ చేసి కొందరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బాగా బద్నామ్ చేస్తున్నారు. అవన్నీ నిజమైనవేనని.. ఆ 400 ఎకరాల్లో ఏదో జరిగిపోతోందని చాలామందిని మభ్యపెట్టగలిగారు. ఆ ఫేక్ ప్రచారంపై సర్కార్ సీరియస్‌గా ఉంది. వాళ్ల అంతు చూడాలని గట్టిగా ఫిక్స్ అయింది. లేటెస్ట్‌గా హైకోర్టులోనూ పిటిషన్ ఫైల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.


కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..!

ఆ 400 ఎకరాల్లో భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్టు నకిలీ వీడియోలు, ఫోటోలు తయారు చేసి వైరల్ చేశారంటూ సర్కారు తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాంటి ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఏప్రిల్ 24న పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ఇలా ప్రభుత్వమే స్వయంగా హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఇక సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సై అంటోంది.

ఫేక్ వీడియోలపై సీఎం సీరియస్

ఏఐ జనరేటెడ్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు.. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. అలాంటి ఫేక్ కంటెంట్‌ను గుర్తించేలా స్పెషల్ సాఫ్ట్‌వేర్ రెడీ చేయాలని సూచించారు. సీఎం ఆదేశాలతో సైబర్ క్రైమ్ సిబ్బంది ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిని గుర్తిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసే మన్నె క్రిశాంక్‌కు నోటీసులు ఇచ్చారు గచ్చిబౌలి పోలీసులు. ఏప్రిల్ 9, 10, 11 తేదీల్లో 3 రోజుల పాటు విచారణకు రావాలని పిలిచారు.

Also Read : బండి సంజయ్ ఇంట్లో నెమళ్లు? 

క్రిశాంక్‌కు ఉచ్చు.. కేటీఆర్ చిక్కేనా?

ఇటు క్రిశాంక్‌కు పోలీస్ నోటీసులు.. అటు హైకోర్టులో పిటిషన్‌తో ఫేక్ గాళ్ల ఖేల్ ఖతం చేసేందుకు సర్కారు సీరియస్ ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ మొత్తం అసత్య ప్రచారం వెనుక మాస్టర్ మైండ్ కేటీఆరే అనే ఆరోపణలు లేకపోలేదు. మరి, పోలీస్ విచారణ క్రిశాంక్‌ దగ్గరే ఆగిపోతుందా? కేటీఆర్ వరకూ వెళ్తుందా? హైకోర్టు ఓకే అంటే అరెస్టులూ జరిగిపోతాయా? ముందుముందు రాజకీయం మరింత రక్తి కట్టనుందా?

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×