E-Paper
Advertisement

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్
Advertisement

Dark Comedy Thriller OTT : అన్షుమాన్ ఝా దర్శకత్వం వహించిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ‘లార్డ్ కర్జాన్ కి హవేలీ’ (Lord Curzon Ki Haveli) థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. అద్భుతమైన స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడవచ్చు ?

‘లార్డ్ కర్జాన్ కి హవేలీ’ జియో హాట్‌స్టార్‌ (JioHotstar)లో అందుబాటులోకి వచ్చేసింది. కామెడీ, ఉద్రిక్త వాతావరణం, గుర్తింపు, అనుబంధం, అపరాధభావం వంటి లోతైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టోరీ అంతా ట్రంకు పెట్టెలో ఉన్న శవం చుట్టూ తిరుగుతుంది.

సినిమా కథ ఏమిటి ?

Advertisement

ఇంగ్లాండ్‌ లో సెటిల్ అయిన ఇద్దరు భారతీయ జంటల చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఒక పాత గ్రామీణ హవేలీలో రాత్రి డిన్నర్‌ కు కలుస్తారు ఆ జంట. పరేష్ పహుజా పోషించిన డాక్టర్ బసుకినాథ్ ఆధిపత్య స్వభావం గల, కఠినమైన బ్రిటిష్-భారతీయ వైద్యుడు. అతని భార్య ఐరా (రసికా దుగల్)తో కలిసి అతను ఈ హవేలీకి వస్తాడు. అక్కడ వారు సాన్య (జోహా రెహమాన్), ఆమె ప్రియుడు రోహిత్ (అర్జున్ మాథుర్)ను కలుస్తారు. సరదాగా మొదలైన ఆ సాయంత్రం వేళ వేసిన ఒకే ఒక జోక్ కథను మలుపు తిప్పుతుంది. ట్రంకు పెట్టెలో లార్డ్ కర్జాన్ శవాన్ని దాచి పెట్టాము అని చెప్తారు సాన్యా జంట. ఆ జోక్ కాస్తా నెమ్మదిగా అనుమానం, ఉద్రిక్తతగా మారుతుంది. ఆ పెట్టెను తెరవాలన్న బసుకి పట్టుదల, ఆ రాత్రిని ఉద్రిక్తంగా, అసౌకర్యంగా మార్చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా సీక్రెట్స్ అన్నీ బయట పడతాయి. ప్రతి డైలాగ్ షార్ప్ గా ఉంటుంది, పరిస్థితులు కలవరపరిచేలా ఉంటాయి.

Also Read : 2 గంటల 41 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… ఫహద్ ఫాజిల్ ను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండరు

ఎవరెవరు ఏ పాత్రల్లో ?

Advertisement

ఇందులో అర్జున్ మాథుర్, రసికా దుగల్, పరేష్ పహుజా, జోహా రెహమాన్ నటన అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిసింది. అర్జున్ మాథుర్ రోహిత్ గా, రసికా దుగల్ ఐరాగా, పరేష్ పహుజా డాక్టర్ బసుకినాథ్ గా, జోహా రెహమాన్ సాన్యగా నటించారు. అన్షుమాన్ ఝా దర్శకత్వం వహించగా, బికాష్ రంజన్ మిశ్రా కథ అందించారు. ఫస్ట్ రే ఫిల్మ్స్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్, జేటీ ప్రొడక్షన్స్, ఆద్య ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. జూన్ 30న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ చిత్రం డార్క్ కామెడీ, సస్పెన్స్ కలగలిపిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ వరకు ఆకట్టుకుంటుంది.

Also Read : 25,21,00,000 వ్యూస్… నాలుగేళ్లుగా నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న సిరీస్… ఇదేం పిచ్చి సామీ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×