E-Paper
Advertisement

Horror Thriller OTT : కొత్త ఇంట్లో సంసారం… కుళ్ళబొడిచే ప్రేతాత్మ… ఒంటరిగా చూడకూడని హార్రర్ మూవీ

Horror Thriller OTT : కొత్త ఇంట్లో సంసారం… కుళ్ళబొడిచే ప్రేతాత్మ… ఒంటరిగా చూడకూడని హార్రర్ మూవీ
Advertisement

Horror Thriller OTT : హారర్ సినిమాలను ఓటిపి ఆడియన్స్ ఇంటి దగ్గరే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే వీటిని చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక మహిళ కొత్త ఇంటికి మారే సమయంలో జరుగుతుంది. ఆమెను వెకేట్ చేయకుండా అడ్డుకుంటుంది. భయంకరమైన సంఘటనలతో ఈ హారర్ స్టోరీ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళ్తే….

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2018లో విడుదలైన అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం ‘కర్స్ ఆఫ్ ది నన్’ (Curse of the Nun). దీనికి ఆరోన్ మిర్టెస్ దర్శకత్వం వహించారు. ఇందులో లేసీ హార్ట్‌సెల్ (అన్నా వింటర్), రే హంట్, కేట్ కిల్‌కోయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ హారర్ మూవీ సెప్టెంబర్ 2018న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా prime videoలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అన్నా వింటర్ అనే ఒక యువతికి గతంలో జరిగిన కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. తన లైఫ్ ని కొత్తగా ప్రారంభించాలని, ఒక కొత్త ఇంటికి మారాలని నిర్ణయించుకుంటుంది. అన్నా తన సామాన్లను సర్దుకుని కొత్త ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి. సిస్టర్ క్యాథరిన్ అనే ఒక భయంకరమైన నన్ ఆత్మ ఆమెను వెంటాడటం మొదలుపెడుతుంది. సిస్టర్ క్యాథరిన్ బతికి ఉన్నప్పుడు చాలా క్రూరమైన పనులు చేసిందని, మరణించిన తర్వాత కూడా ఆమె ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లడం లేదని తెలుస్తుంది. ఆ ఆత్మ తన పరిధిలోకి వచ్చిన వారిని అస్సలు వదలదు.

అన్నా ఆ ఇంటి నుండి బయటపడాలని ప్రయత్నించిన ప్రతిసారీ, ఆ నన్ ఆత్మ ఆమెను అడ్డుకుంటుంది. అన్నా స్నేహితులు ఆమెకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు కూడా ఈ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అన్నా ఆ ఆత్మ నుండి తనను తాను కాపాడుకోవడానికి ఎంతో పోరాడుతుంది. చివరికి అన్నా ఆ ఇంటి నుండి ప్రాణాలతో బయటపడిందా ? ఆ ఆత్మకి బలవుతుందా ? అనే ఈషయాలను, ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ఆది సాయికుమార్ సూపర్ హిట్ మిస్టిక్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో ఎప్పుడు చూడవచ్చో తెలుసా ?

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×