E-Paper
Advertisement

Horror thriller OTT: ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?

Horror thriller OTT:  ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Horror thriller OTT : ఓటీటీలోకి టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆరుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ మూవీ, ఊపిరి సలపని యాక్షన్, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 తీయడం జరిగింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ వీకెండ్ సినిమా చూసి ఫుల్ గా చిల్ అవ్వండి. ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ హారర్ మూవీ పేరు రీ/మెంబర్: ది లాస్ట్ నైట్ (Re/Member: The Last Night). ఇందులో కన్నా హషిమోటో, గోర్డాన్ మేడా, మారిన్ హోండా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 మార్చి 5 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. భాష: ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జపనీస్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనికి ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 2022లో వచ్చిన ‘రీ/మెంబర్’ చిత్రానికి సీక్వెల్. ఇక మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రసిద్ధ కె-పాప్ గ్రూప్ స్ట్రే కిడ్స్ పాడిన “పరేడ్” అనే పాట చాలా ఫేమస్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి భాగంలో ‘రెడ్ పర్సన్’ శాపం నుండి తప్పించుకున్న అసుక (కన్నా హషిమోటో) ఆమె స్నేహితులు, మూడేళ్ల తర్వాత మళ్ళీ ఊహించని ప్రమాదంలో పడతారు. అసుక అకస్మాత్తుగా మాయమవడంతో, ఆమెను వెతుకుతూ వెళ్ళిన స్నేహితులకు మళ్ళీ ఆ భయంకరమైన టైమ్ లూప్ (ఒకే రోజు మళ్ళీ మళ్ళీ రావడం) ఎదురవుతుంది. ఈసారి ఆ శాపం మరింత శక్తివంతంగా మారుతుంది. అసుక ఎక్కడుందో కనిపెట్టి, ఆమె శరీరాన్ని తిరిగి చేర్చకపోతే వారందరూ ఆ రాత్రిలోనే చిక్కుకుపోవడమే కాకుండా, తమ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. స్కూల్ ఆవరణలో జరిగే ఈ భయంకరమైన వీళ్ళంతా కలిసి ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ భయంకరమైన శాపం నుంచి వీళ్ళంతా ఎలా బయటపడ్డారు ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Tags

Related News

ఆడుకుంటుంటే చేతికి చిక్కిన 5 కోట్ల అదృష్టం… రాత్రికి రాత్రే మారిపోయిన తలరాత… పక్కా ఫ్యామిలీ డ్రామా

కాళ్ళకి చెప్పులు లేవు… కానీ కళ్ళలో వరల్డ్ కప్ కల… ఏడుగురు కుర్రాళ్ల అన్స్టాపబుల్ గూస్బంప్స్ స్టోరీ

కళ్ళు తెరిచి చూస్తే నిజమైన గేమ్‌లో… కానీ రియల్ లైఫ్‌లో నరకం… డార్క్ యాక్షన్ సిరీస్

పవిత్రమైన చెట్టును నరికిన మూడ్రోజులకే ఇంటి పెద్ద మృతి… 16 రోజుల్లో ఐదుగురి చావులు… నవ్విస్తూ భయపెట్టే మలయాళ థ్రిల్లర్

చీకటి పడితే ఆ అడవిలోకి పోవద్దు… వనదేవత విలయతాండవం… ఒళ్లు గగుర్పొడిచే హారర్

బలవంతంగా పెళ్లి… వాయిస్‌ మెసేజ్‌తో కుప్పకూలిన సంసారం… హార్ట్ టచింగ్ రొమాంటిక్ మూవీ

చెస్‌ బోర్డ్‌ మీద ప్రపంచాన్ని జయించాలనుకుంటున్న పదేళ్ల పిల్లాడి కథ… ఇన్స్పిరేషనల్ స్పోర్ట్స్ డ్రామా

ఆసుపత్రిలో దాడి… అదే సమయంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ… గూస్‌బంప్స్ తెప్పించే మలయాళ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×