Horror Thriller OTT : ఓటీటీలో ఒక హారర్ థ్రిల్లర్ తెగ భయపెడుతోంది. పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కంటే, సౌండ్ ఎఫెక్ట్స్, చీకటి గదుల్లో తీసిన షాట్స్‌తో ప్రేక్షకులను భయపెట్టడానికి ప్రయత్నించారు మేకర్స్ . అయితే ఈ ప్రయత్నాలు సక్సెస్ కూడా అయ్యాయి. సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలియని భయం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. ఈ సినిమా కథ అంతా రాచెల్, నీతా అనే ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సీట్ ఎడ్జ్ థ్రిల్ పక్కాగా ఉంటుంది ఇందులో.
ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘వర్ నాట్ సేఫ్ హియర్’ (We’re Not Safe Here). దీనికి సోలమన్ గ్రే దర్శకత్వం వహించారు. ఇందులో హేలీ మెక్‌ఫార్లాండ్ (రాచెల్), షర్మితా భట్టాచార్య (నీతా) లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025 ఆగస్టు 22న విడుదలైంది. ప్రస్తుతం ఇది Amazon Prime Video, Apple TV డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో అందుబాటులో ఉంది.
రాచెల్ అనే ఒక అమ్మాయి ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఇంట్లో వాళ్ళు, పోలీసులు వెతికి వెతికి అలసిపోతారు. కానీ కొన్నాళ్ల తర్వాత, ఎవరూ ఊహించని విధంగా ఆమె మళ్ళీ తిరిగి వస్తుంది. అయితే వచ్చిన ఆమె మామూలుగా లేదు, ఏదో పెద్ద గండం నుంచి బయటపడి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చినట్టు భయం భయంగా ఉంటుంది. తన స్నేహితురాలు నీతా దగ్గరికి వెళ్లి, అసలు తనకి ఏం జరిగిందో చెప్పడం మొదలుపెడుతుంది. రాచెల్ తన స్నేహితురాలికి తను మాయమైనప్పుడు జరిగిన వింతలు, ఎదురైన భయంకరమైన శక్తుల గురించి వివరిస్తుంది. తను ఎక్కడికి వెళ్ళింది? అక్కడ తనని ఎవరు వేధించారు? ఆ చీకటి శక్తులు తనని ఎలా వెంటాడాయి? అనే విషయాలు చెబుతుంటే వినే నీతాకి కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఆ చెప్పే కథ ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది కేవలం మాటలకే పరిమితం కాకుండా చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది.
కథ వింటున్న కొద్దీ, రాచెల్ చెప్పే ఆ శక్తులు కేవలం కథలో మాత్రమే లేవని, అవి నిజంగానే వీరిద్దరినీ ఇప్పుడు కూడా వెంటాడుతున్నాయని అర్థమవుతుంది. ఆ గదిలో వింత శబ్దాలు రావడం, ఏదో అదృశ్య శక్తి తమని చంపాలని చూడటంతో కథ మరింత ఉత్కంఠంగా తిరుగుతుంది. చివరకు ఆ భయంకరమైన శక్తి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు? రాచెల్ నిజంగానే ప్రాణాలతో వచ్చిందా ? ఆమె ఆత్మ రూపంలో వచ్చిందా? ఇంతకీ వీళ్ళను వెంటాడుతున్న శక్తులు ఏమిటి ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : రాణి గారి ప్రేమలో సేవకుడు… కళ్ళు చెదిరే సీన్స్… ఓ పట్టు పట్టాల్సిన సినిమా