BigTV English

OTT Movie : ఒక్క మర్డర్ ఎన్నో అనుమానాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు… క్రిప్టో కరెన్సీతో కిక్కెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఒక్క మర్డర్ ఎన్నో అనుమానాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు… క్రిప్టో కరెన్సీతో కిక్కెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie  : ఓటీటీలో ఇప్పుడు మర్డర్ ఇన్వెస్టిగేషన్ సినిమాలను, కొత్త తరహాలో ప్రెజెంట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు దర్శకులు. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాను క్రిప్టో కరెన్సీ ని బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

ఆల్బర్ట్ పింటో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. అయితే ఆ తర్వాత అతను చనిపోయి ఉంటాడు. అతని మరణం అనుమానస్పదంగా ఉంటుంది. ఈ కేసును పరిశోధించడానికి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజ్‌వీర్ సింగ్ తన బృందంతో కలిసి పింటో నివాసానికి చేరుకుంటాడు. నిజానికి ఆల్బర్ట్ పింటో ఒక సంపన్న వ్యక్తి, అతను 35 కోట్ల రూపాయల క్రిప్టోకరెన్సీ ని కలిగి ఉంటాడు. ఈ కరెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి కంట్లో కూడా పడుతుంది. ఆమె ఈ కేసులో డబ్బు ఆధారంగా హంతకుడిని కనిపెట్టాలని భావిస్తుంది. అయితే రాజ్‌వీర్ మొదట హత్యను పరిష్కరించాలని, ఆ తర్వాత డబ్బు విషయం దానికదే బయట పడుతుందని నమ్ముతాడు. పింటో ఇంటిలో ఉన్న భార్య రాగిణి, సోదరుడు ఆంథోనీ, సోదరి ఆస్థా, లాయర్ కరణ్ సిన్హా, డాక్టర్ ఫెర్నాండెస్, స్నేహితుడు కల్నల్ వర్మ అందరూ అనుమానితులుగా మారతారు.


వీళ్లందరికీ ఆల్బర్ట్‌ను హత్య చేయడానికి వివిధ కారణాలు ఉన్నట్లు కనిపిస్తాయి. రాజ్‌వీర్ అతని బృందం ప్రతి ఒక్కరినీ విచారించి, ఆల్బర్ట్ గతం, అతని క్రిప్టోకరెన్సీ లావాదేవీలను లోతుగా పరిశీలించడం ద్వారా నిజాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ పరిశోధనలో అనేక రహస్యాలు బయటపడతాయి. సత్పరి అనేక మలుపులు తిరుగుతుంది.  చివరికి ఆల్బర్ట్ ని హత్య చేసింది ఎవరు ? ఎందుకు చంపారు ? పోలీసుల వెలుగులోకి తెచ్చే విషయాలు ఏమిటి ? క్రిప్టో కరెన్సీ ఎవరి ఆధీనంలో ఉంటుంది ? అనే వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బాలీవుడ్ సస్పెన్స్  థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మహిళ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

 

జీ 5 (Zee 5) లో

ఈ బాలీవుడ్ సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ పేరు ‘హౌస్ ఆఫ్ లైస్’ (House of Lies). 2024 లో వచ్చిన ఈ మూవీకి సౌమిత్ర సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ కపూర్, అజితేష్ గుప్తా, హితేన్ పైంటల్ మరియు గిరీష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది మర్డర్ మిస్టరీ జానర్‌లో రూపొందింది. ఈ చిత్రం ఆల్బర్ట్ పింటో అనే వ్యక్తి హత్య చుట్టూ తిరుగుతుంది. జీ 5 (Zee 5) ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×