Sridevi: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నిర్మాత వ్యవహరించిన సినిమా కోర్టు. రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. నానికి మంచి కలెక్షన్లను అందించింది. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల అదరణ పొంది బాక్సాఫీస్ వద్ద 59 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇక మూవీలో పేదింటి అబ్బాయి చందు పాత్రలో రోషన్ నటించాడు. పెద్దింటి అమ్మాయి జాబిలి పాత్రలో శ్రీదేవి నటించి అందరి మదిలో నిలిచింది. తాజాగా ఈమె ఓ అవార్డును గెలుచుకుంది. అందులో భాగంగా తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వివరాలు చూద్దాం..
తల్లి గురించి చెప్తూ ..ఎమోషనల్ అయిన హీరోయిన్ ..
కోర్టు మూవీలో హీరోగా రోషన్ హీరోయిన్ గా శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్, కీలక పాత్రలో నటించారు.వీరి గురించి అందరికి తెలుసు. కానీ శ్రీదేవి గురించి మూవీ రిలీజ్ అయిన తర్వాతే తెలిసింది. ఈమె కాకినాడ లో జన్మించింది. అచ్చమైన తెలుగు అమ్మాయి. కోర్టు మూవీ జాబిలి పాత్రకు, టీనేజ్ అమ్మాయిగా నటించి మెప్పించారు శ్రీదేవి. తాజాగా జీ తెలుగు అప్సర అవార్డ్స్ ప్రకటించింది. తాజాగా ఈ అవార్డు ఫంక్షన్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో తో శ్రీదేవి ఎమోషనల్ వీడియో బయటకు వచ్చింది. వీడియో స్టార్టింగ్ లో కోర్టు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ‘ప్రేమలో’ పాటకు రోషన్, శ్రీదేవి కలిసి డాన్స్ చేస్తారు. అనంతరం ఆమెకు అప్సర అవార్డును నిర్మాత కోన వెంకట్ అందిస్తారు. అవార్డు అందుకున్నాక శ్రీదేవి మాట్లాడుతూ… నేను ఈ పొజిషన్లోకి ఇక్కడ నిలబడి అవార్డు తీసుకున్నాను అంటే అందుకు కారణం కోర్టు మూవీ. మా అమ్మ సింగిల్ పేరెంట్. ఎంతో స్ట్రగుల్స్ ని ఎదుర్కొని ఎన్నో బాధలు పడి నన్ను మా అక్కను పెంచింది. అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ తన తల్లిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. అది చూసి అక్కడ వున్న వారందరికి కంటతడి పెట్టిస్తుంది. నేను ఈ పొజిషన్లోకి రావడానికి మా అమ్మ ఎంతో కష్టపడింది అంటూ తన తల్లి పాదాలకు నమస్కారం చేస్తుంది. ఈ సంఘటనతో అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతో ఎమోషనల్ గా ఉన్న ఈ వీడియోను జీ తెలుగు రిలీజ్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా ఆమెకు ధైర్యం చెప్పు కామెంట్ చేస్తున్నారు.
జాబిలికి అవార్డు..ప్రశంసలు ..
కోర్టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రెండు వారాల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. సినిమా కధ,నటన సాంకేతిక అంశాలు, విమర్శకుల నుండి మంచి ప్రశంసలను పొందాయి. నాని బ్రాండ్ సినిమా కంటెంట్, డైలాగులు సినిమాని విజయపథంలో దూసుకుపోయేలా చేశాయి. ఈ సినిమాతో స్టార్ డాన్స్ సొంతం చేసుకుంది జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవి. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రీల్స్ చూసి మూవీ టీం ఆమెను జాబిల్లి పాత్రకు ఎంపిక చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఆమె నటనకు విమర్శకులు నుండి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మూవీ తర్వాత ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చినట్లు టాలీవుడ్ లో టాక్. ఏది ఏమైనా మొదటి సినిమా తోనే అవార్డు అందుకోవటం విశేషం.