E-Paper
Advertisement

చేయని నేరానికి జైలుకెళ్ళి ఎస్కేప్… చచ్చిన కొడుకుని వెతుక్కుంటూ… మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

చేయని నేరానికి జైలుకెళ్ళి ఎస్కేప్… చచ్చిన కొడుకుని వెతుక్కుంటూ… మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Suspense Thriller : సొంత కొడుకుని చంపాడు అన్న ఆరోపణతో చేయని నేరానికి జైలుకెళ్లే హీరో… యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ఆ తండ్రికి హోప్ ఇస్తుంది ఓ పుట్టుమచ్చ. దీంతో కథలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. నిజం తెలుసుకోవడానికి జైలు నుంచి ఎస్కేప్ అయ్యి, తన కొడుకును వెతుక్కుంటూ ఆ తండ్రి చేసే ప్రయాణమే ఈరోజు మన మూవీ సజెషన్. ఈ సిరీస్ పేరు ‘ఐ విల్ ఫైండ్ యు’. 2026లో రిలీజ్ అయిన ఈ సిరీస్ పాపులర్ థ్రిల్లర్ రైటర్ హార్లాన్ కోబెన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. మరి సస్పెన్స్ క్రైమ్ డ్రామా జానర్లో రూపొందిన ఈ మినీ సిరీస్ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

కథలోకి వెళ్తే… 

ఈ సిరీస్ లో హీరో పేరు డేవిడ్ బరోస్. అతని కొడుకు మాథ్యూ. అయితే డేవిడ్ సొంత కొడుకుని హత్య చేశాడని ఆరోపణలతో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో అక్కడ అతనికి జీవిత ఖైదు విధిస్తారు. ఈ క్రమంలోనే ఓ రోజు అతని మాజీ భార్య చెరిల్ సోదరి రాచల్ ఎంట్రీ ఇస్తుంది. ఓ రోజు జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేవిడ్ ను కలుస్తుంది. అక్కడ ఆమె డేవిడ్ కి ఒక సీక్రెట్ ఫోటోని చూపిస్తుంది. అందులో అతని కొడుకు మ్యాచ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో సజీవంగా కనిపిస్తాడు.

Advertisement

నిజానికి అది అతని కొడుకేనా అన్న విషయంపై క్లారిటీ ఉండదు. కాకపోతే ఆ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి ఒంటిపై ఓ పుట్టుమచ్చని చూసి హీరో అది తన కొడుకు అని ఫిక్స్ అవుతాడు. నిజానికి తన కొడుకు చనిపోలేదని ఎవరో అతన్ని కిడ్నాప్ చేశారన్న విషయాన్ని గ్రహించడానికి డేవిడ్ కి పెద్దగా టైం పట్టదు. తను నిర్దోషిని అని నిరూపించుకోవడంతో పాటు కొడుకుని రక్షించుకోవడం కోసం జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. దీంతో ఎస్బిఐ అధికారులు అతని కోసం వేట మొదలు పెడతారు.

డేవిడ్ భార్య చెరిల్, ఆమె సోదరి, సోదరి బాయ్ ఫ్రెండ్ సహాయంతో అసలు కిడ్నాపర్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇంతకీ డేవిడ్ కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరు ? ఎందుకని అతనికి జీవిత ఖైదు పడే విధంగా ప్లాన్ చేశారు ? చివరికి హీరో ఈ కుట్రను ఎలా చేదించాడు ? అన్నది స్టోరీ. ఈ సిరీస్ లో కోబెన్స్ స్టైల్ లోనే ఊహించని మలుపులు, చివరి వరకు ఉత్కంఠమైన స్క్రీన్ ప్లే ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాలో వచ్చే ఒక్కో ట్విస్ట్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరో డేవిడ్ బరోస్ పాత్రలో సామ్ వర్తింగ్టన్ నటించాడు. తన కొడుకుని వెతుకులాడే తండ్రి పాత్రలో ఆడియన్స్ ని మెప్పిస్తాడు. ఇక డేవిడ్ కు సహాయం చేసే మాజీ భార్య చెరిల్ సోదరిగా బ్రిట్ లోవర్ నటించింది. అలాగే ఆమె మాజీ ప్రియుడు, డేవిడ్ అన్వేషణకు సాయం చేసే వ్యక్తిగా మైలో వెంటిమిగ్లియా నటించారు. డేవిడ్ మాజీ భార్యగా ఎరిన్ రిచర్డ్స్ కనిపిస్తుంది. ఈ సిరీస్ ను సస్పెన్స్ మూవీ లవర్స్ నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు.

Advertisement

Read Also : అమెరికాను రెండు భాగాలుగా పంచుకునే జపాన్ జర్మనీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన మాస్టర్ పీస్ సిరీస్

Tags

Related News

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్‌కి ఇంత ఘోరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉందా? ఈ మూవీని డోంట్ మిస్

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

హాలీవుడ్‌ను ఏలిన మినియన్స్… రాక్షసులను దించి ప్రపంచాన్నే డేంజర్లో పడేసే బొమ్మలు

25 ఏళ్లుగా ప్రాణాలతో చెలగాటం… జాకాస్ గ్యాంగ్‌కు ఎమోషనల్ ఫేర్‌వెల్

చైనీస్ కుంగ్ ఫూను అంతం చేయాలని చూసిన విలన్లకు దిమ్మతిరిగే షాక్… చివర్లో హై-వోల్టేజ్ ఫైట్

హారర్ సినిమాల పిచ్చి ఉన్న అమ్మాయినే టార్గెట్ చేసిన మాస్క్ కిల్లర్… హాలోవీన్ రాత్రి నరమేధం

Big Stories

Advertisement
×