E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌
Advertisement

Silver Siegers Missed Run out Tazmin Brits:   మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) చివరి దశకు వచ్చేసింది. చెత్త ప్రదర్శన కనబరిచిన జట్లన్నీ ఎలిమినేట్ అవుతుండగా, అద్భుతంగా రాణించిన జట్లు ముందుకు దూసుకు వెళ్తున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. నిన్న కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్ ( County Ground, Bristol) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మహిళల జట్ల (South Africa Women vs Netherlands Women, 24th Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఏకంగా 88 పరుగులు తేడాతో విజయం సాధించి, సెమీ ఫైనల్ ఆశలను మరింత పెంచుకుంది.

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

Advertisement

నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) సెంచరీ చేసి రాణించారు. అయితే ఈమెను 40 పరుగుల వద్ద ర‌నౌట్ చేసే అవకాశం రాగా, నెదర్లాండ్స్ చేజేతులా పోగొట్టుకుంది. నెదర్లాండ్ కీలక ప్లేయర్ సిల్వర్ సీగర్స్ (Silver Siegers), చేసిన తప్పిదం కారణంగా రనౌట్ మిస్ అయింది. ఆ దెబ్బకు తజ్మిన్ బ్రిట్స్ సెంచరీ చేసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని… అందుకే నెదర్లాండ్ కీలక ప్లేయర్ సిల్వర్ సీగర్స్ కావాలనే రన్ అవుట్ మిస్ చేసిందని అంటున్నారు.

ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న నెదర్లాండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో దక్షిణాఫ్రికా మొదటి బ్యాటింగ్ చేసి 208 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో నెదర్లాండ్స్ 120 పరుగులకు కుప్పకూలింది. దీంతో 88 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు, టీమిండియా కు షాక్ ఇచ్చింది. సెమీ ఫైనల్ ఆశలను మరింత పెంచుకుంది. అయితే నెదర్లాండ్స్ తో మ్యాచ్ సందర్భంగా మిస్ అయిన ఓ రనౌట్ కారణంగా దక్షిణాఫ్రికా అవలీలగా గెలిచిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిన్న ఓపెనర్లుగా లారా, తజ్మిన్ బ్రిట్స్ దిగారు. లారా 45 పరుగులు చేయగా, బ్రిడ్జ్ మాత్రం 114 పరుగులు సాధించారు.

Advertisement

అయితే తజ్మిన్ బ్రిట్స్ 40 పరుగుల వద్ద ఉండగా, సిల్వర్ సీగ‌ర్స్‌ బౌలింగ్ లో సింగిల్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ఫీల్డర్ బౌలర్ సిల్వర్ కు బంతి నేరుగా వేయడం జరిగింది. ఈ క్ర‌మంలో వెంటనే వికెట్లను కొట్టకుండా, లారాను ర‌నౌట్ చేయాలనే ఉద్దేశంతో వికెట్ కీపర్ వైపు త్రో వేసింది సిల్వ‌ర్‌. అయితే వికెట్ కీపర్ కు వేయకుండా, బౌలర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లను బాదేసి ఉంటే, బ్రిట్స్‌ 40 పరుగుల వద్ద ఔట్ అయ్యేది. ఆమె సెంచరీ మిస్ చేసుకునేది. ఈ క్రమంలో నెదర్లాండ్స్ గెలిచే అవకాశాలు ఉండేవి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ రనౌట్ కావాలనే నెదర్లాండ్స్ కావాలని మిస్ చేసిందని ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. టీమిండియా సెమీఫైనల్ కు వెళ్లకూడదన్న కుట్రతో దక్షిణాఫ్రికా గెలిచేలా ప్రవర్తించారని… ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లో ( Match Fixing) భాగంగా జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ హార్ట్ టాపిక్ అయింది.

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

నెద‌ర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా విజ‌యం…టీమిండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు ?

IND VS IRE: వైభ‌వ్ ను ఆడించ‌డం దండ‌గే, వాడి కోసం మంచి ప్లేయ‌ర్ల‌ను తొల‌గించ‌డం క‌రెక్ట్ కాదు!

వివాదంలో అంబానీ…ముంబై జ‌ట్టులోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌల‌ర్ !

మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ..ఐర్లాండ్ కెప్టెన్ వార్నింగ్

విరాట్ కోహ్లీకి బిగ్ షాక్‌.. మార్కెట్ లో ఫేక్ వన్8 షూస్ క‌ల‌క‌లం !

Tanveer Ahmed: పాకిస్తాన్ లో అడుగు పెట్టేట‌ప్పుడు జాగ్ర‌త్త‌..రాళ్ల‌తో అభిమానులు కొడ‌తారు

హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ? ఆస్ప‌త్రి నుంచి రాగానే సెల‌క్ట్ చేశారు

Big Stories

×