BigTV English

Allu Arjun: ఈ తరం హీరోలలో బన్నీ ఫేవరెట్ హీరో ఎవరంటే..?

Allu Arjun: ఈ తరం హీరోలలో బన్నీ ఫేవరెట్ హీరో ఎవరంటే..?

Allu Arjun: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే అభిమానులకు ఫేవరెట్ హీరో ఉండడం సహజమే. అయితే ఆ హీరోలకి కూడా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ విషయాలను వారు అప్పుడప్పుడు ఆయా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటపెడతారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ (Allu Arjun) వంతు వచ్చింది. తాజాగా పుష్ప -2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే ‘ సీజన్ 4 ఎపిసోడ్ కి ముఖ్యఅతిథిగా విచ్చేశారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో పలు అంశాలపై ముచ్చటించిన ఈయన, తన ఫేవరెట్ హీరో ఎవరో కూడా తెలిపారు. ముఖ్యంగా ఈతరం హీరోలలో నీకు ఇష్టమైన హీరో ఎవరు? అని బాలయ్య ప్రశ్నించగా.. అందుకు అల్లు అర్జున్ కూడా తనదైన శైలిలో సమాధానం తెలిపారు.


ఈతరం హీరోలపై బన్నీ కామెంట్స్..

తాజాగా అల్లు అర్జున్ ఈ షోలో బోలెడు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే బాలయ్య అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా తనదైన శైలిలో సమాధానం తెలిపారు. ఇకపోతే బాలయ్య మాట్లాడుతూ..” ఈతరం జనరేషన్ లో నీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు?” అని అడగ్గా.. అల్లు అర్జున్ మాట్లాడుతూ..” అర్జున్ రెడ్డి సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonada) పర్ఫామెన్స్ చాలా బాగా నచ్చింది. అయితే ‘జాతి రత్నాలు’ సినిమాలో నవీన్ పోలిశెట్టి(Naveen polishetty) అంటే ఇంకా ఇష్టం పెరిగింది. ఈ సినిమా చూసినంత సేపు కూడా నేను కింద పడి పడి నవ్వుకున్నాను. అలాగే ‘డీజె టిల్లు’ సినిమా చూసిన తర్వాత సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) మరింత నచ్చాడు. అయితే ఈమధ్య యంగ్ హీరో విశ్వక్ సేన్ (Viswak sen) కూడా బాగా నచ్చేస్తున్నాడు. అలాగే అడివి శేష్ (Adivi shesh) ని బాగా అడ్మైర్ చేస్తాను అంటూ అందరి హీరోల పేర్లను బయటికి తీస్తూ.. ఎవరిని హర్ట్ చేయకుండా చాలా తెలివిగా సమాధానం తెలిపాడు అల్లు అర్జున్.


బన్నీ ఫేవరెట్ హీరో అతడే..

ఇక అల్లు అర్జున్ తెలివితేటలకు అభిమానులు ఫిదా అవడమే కాదు.. ఆ యంగ్ హీరోల ఫ్యాన్స్ కూడా సంబరపడిపోతున్నారు.. అయితే బాలకృష్ణ..” ఇదంతా కాదు కేవలం ఒక్కరి పేరు మాత్రమే చెప్పమని” అడగడంతో.. అల్లు అర్జున్..” నన్ను బాగా ఇంపాక్ట్ చేసింది మాత్రం సిద్దు జొన్నలగడ్డ. డీజె టిల్లు సినిమాతో నన్ను మరింత ఇంప్రెస్ చేశాడు”.అంటూ అల్లు అర్జున్ తెలిపారు. ఇకపోతే ఇప్పటి హీరోల్లో అల్లు అర్జున్ కి వీరంటే బాగా ఇష్టమని, అందులోనూ యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ అంటే ఇంకా ఇష్టమని అర్థం అవుతోంది. ఏది ఏమైనా బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే డిసెంబర్ 5వ తేదీన పుష్ప -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ . మరి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×