OTT Movie : మలయాళం సినిమాలు ఇప్పుడు ఓటీటీలో దుమ్ము లేపుతున్నాయి. సినిమా చూడాలనుకున్నప్పుడు, మలయాళం సినిమాలపై ఓ లుక్ వేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ట్విస్ట్ లతో మెంటలెక్కించేస్తుంది. ఇందులో త్రిష ప్రధాన పాత్రలో మంచి నటనను ప్రదర్శించింది. ఈ సినిమా సస్పెన్స్‌తో నిండిన ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
జీ 5 (ZEE 5) లో
ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఐడెంటిటీ’ (Identity). దీనికి అనాస్ ఖాన్, అఖిల్ పాల్ దర్శకత్వం వహించారు. ఇది తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమాలో టొవినో థామస్, త్రిష కృష్ణన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మందిరా బేడి, అజు వర్గీస్, అర్చన కవి, అర్జున్ రాధాకృష్ణన్ తదితురులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జీ 5 (ZEE 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అమర్ ఫెలిక్స్ ఒక బట్టల దుకాణంలో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ రహస్యంగా మహిళలను ట్రయల్ రూమ్‌లలో వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. ఒకరోజు అతని దుకాణంకి ఎవరో నిప్పు పెట్టడంవల్ల అది పూర్తిగా కాలిపోతుంది. అక్కడ అమర్ హత్యకు గురవుతాడు. ఆ ప్రాంతంలో హత్యను చూసిన ఏకైక సాక్షి అలీషా అబ్దుల్ సమద్ (త్రిష). ఈమె ఒక జర్నలిస్ట్ గా ఉంటుంది. అయితే ఆమెకు ప్రోసోపాగ్నోసియా (ముఖాలను గుర్తించలేని వ్యాధి) అనే వ్యాధి ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా ఆమె హంతకుడి ముఖాన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. ఈ కేసును పోలీసు అధికారి అలెన్ జాకబ్ (వినయ్ రాయ్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.
అతను అలీషాను రక్షణ కోసం DSP దినేష్ చంద్రన్ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ అలెన్‌కు హరన్ అనే స్కెచ్ ఆర్టిస్ట్ పరిచయమవుతాడు. అలీషా వివరణల ఆధారంగా హరన్ హంతకుడి స్కెచ్ తయారు చేస్తాడు. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్‌లు బయటపడతాయి. హరన్‌కు అమర్ హత్యతో సంబంధం ఉందని తెలుస్తుంది. అతను తన సోదరి నీర్జా, ఆమె స్నేహితురాలు సకీనాపై, అమర్ చేసిన అత్యాచారానికి ప్రతీకారంగా అతన్ని చంపి ఉంటాడు. అలెన్ కి కూడా ఈ కేసులో పరోక్షంగా సంబంధం ఉంటుంది. చివరికి అమర్ కేసు ఎటువంటి విషయాలను వెలుగులోకి తెస్తుంది ? అలెన్ కూడా ఈ కేసులో నెరస్తుడా ? అలీషా ఈ కేసును ఎలా హాండిల్ చేస్తుంది ? అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మైండ్ గేమ్ తో పిచ్చెక్కించే క్రేజీ కన్నడ మూవీ… గూస్ బంప్స్ తెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్