OTT Movie : టైమ్ ట్రావెల్ చేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ నుంచి వస్తుంటాయి. అయితే ‘ఆదిత్య 369’ లాంటి సినిమాలతో మనవాళ్లు కూడా సత్తా చాటారు. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే గత ఏడాది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక టైమ్ ట్రావెల్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ దూసుకుపోతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ఆహా (aha) లో
ఈ కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లింక్’ (Blink). 2024 లో విడుదలైన ఈ మూవీకి శ్రీనిధి దర్శకత్వం వహించారు. ఇందులో దీక్షిత్ శెట్టి, చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలు పోషించారు. సౌండ్‌ట్రాక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ను ఎంఎస్. ప్రసన్న కుమార్ కంపోజ్ చేయగా, సినిమాటోగ్రఫీ అవినాశ శాస్త్రి, ఎడిటింగ్ సంజీవ్ జాగీర్దార్ అందించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అపూర్వ అనే 24 ఏళ్ల యువకుడు బెంగళూరులో నివసిస్తుంటాడు. అతను MA డిగ్రీ ఫెయిల్ అవ్వడంతో, తన తల్లికి ఈ విషయం చెప్పకుండా దాచి పెడతాడు. పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తూ, తన ప్రేమికురాలు స్వప్నతో సమయం గడుపుతుంటాడు. అపూర్వకు ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. అతను 30 నిమిషాల పాటు కన్ను రెప్ప వేయకుండా ఉండగలడు. కానీ ఈ స్కిల్ అతనికి ఒక శాపంగా మారుతుంది. ఒక రోజు అరివు అనే ఒక వృద్ధుడు అపూర్వ జీవితంలోకి ప్రవేశిస్తాడు.
అతను అపూర్వ తండ్రి ఇంకా బతికే ఉన్నాడని చెప్తాడు. ఇది అపూర్వను షాక్ కు గురి చేస్తుంది. అరివు ఒక టైమ్ ట్రావెలర్ గా, తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఒక ప్రత్యేక వాచ్ సహాయంతో టైమ్ ట్రావెల్ చేయగలనని చెబుతాడు. అపూర్వ ఈ టైమ్ ట్రావెల్ ను ఉపయోగించి, తన తండ్రి గురించి నిజం తెలుసుకోవడానికి గతంలోకి ప్రయాణిస్తాడు. అపూర్వ టైమ్ ట్రావెల్ చేస్తున్న సమయంలో, అతను తన కుటుంబం గురించి ఊహించని రహస్యాలను తెలుసుకుంటాడు.
ఈ టైమ్ ట్రావెల్ అతనికి అనుకోని పరిణామాలను తెచ్చి పెడుతుంది. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చివరికి అపూర్వ తన తండ్రి గురించిన రహస్యాలు తెలుసుకుంటాడా ? ఈ టైమ్ ట్రావెల్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : చూస్తుండగానే తుడిచి పెట్టేసే సునామీ… మిస్ అవ్వకుండా చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్