BigTV English

AP Control Room: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఏపీ ప్రజలు తప్పక.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి..

AP Control Room: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఏపీ ప్రజలు తప్పక.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి..

AP Control Room: ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రుదేశం పాకిస్తాన్ ను మన సైన్యం కకావికలం చేసిన విషయం తెలిసిందే. కానీ వంకర బుద్ధి గల పాకిస్తాన్ మనల్ని దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించినప్పటికీ మన సైనికుల పోరాట పటిమ ముందు అది హుష్ కాకి అన్న విషయం కూడా తెలిసిందే. ప్రధాని మోడీ అనునిత్యం క్షణం తీరిక లేకుండా జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మన దేశ ప్రజల రక్షణ కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్నారు.


కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై యావత్ భారతావని గర్విస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో మన సైన్యం సైతం నూతనోత్సాహంతో పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితులలో మన దేశ పౌరుల రక్షణ కోసం ముందస్తుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పలు రాష్ట్రాలకు సైతం కేంద్రం పలు సూచనలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ పౌరులకు సీఎం ఓ సూచన చేశారు. భారత్ – పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా.. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న లేదా ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఏపీ ప్రజలకు తగిన సాయం అందించడం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీఎం అక్కడి అధికారులను ఆదేశించారు.


Also Read: Twin Tower In Amaravati: అమరావతిలో మరో ఇంద్రభవనం.. ఈ డిజైన్ కు మతి పోవాల్సిందే..

కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే
ఏపీ భవన్ 011-23387089, 9871999430, 9871999053 కంట్రోల్ రూమ్ నెంబర్లు కాగా, అదనపు సహాయం లేదా సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్ ఎంవీఎస్ రామారావు 9871990081, లైజన్ ఆఫీసర్ వి.సురేష్ బాబు 9818395787 నంబర్లకు సంప్రదించాలని సీఎం కోరారు. ఏపీ ప్రజలు సుదూరాన ఉన్న వారికి ఈ నెంబర్లు అందజేస్తే, అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చేందుకు వీలు ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×