India Vs Pakistan War : పాముకు పాలు పోసి పెంచినా అది ఏనాటికైనా కాటేస్తుంది. పాపిష్టి దేశాలకు ఎలాంటి సాయం చేసినా వాటికి విశ్వాసం ఉండదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తుర్కియే ( టర్కీ ) దేశం. 2023లో భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది తుర్కియే. ఆ సమయంలో ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో సుమారు 9 లక్షల డాలర్ల విలువైన సామాగ్రి అందించింది ఇండియా. పాపం అని భారత్ సాయం చేస్తే.. చేసిన మంచి మరిచింది తుర్కియే. మన శత్రు దేశమైన పాపిష్టి పాకిస్తాన్‌కు ఫుల్‌గా సాయం చేస్తోంది.
పాక్‌కు టర్కీ డ్రోన్లు
గురువారం రాత్రి భారత్‌పై సుమారు 400 డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది పాక్. వాటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా పేల్చేసింది. మనకు చిన్న డ్యామేజ్ కూడా జరగలేదు. అయితే, పాక్ ప్రయోగించిన ఆ డ్రోన్లు తుర్కియే దేశానికి చెందినవే అనే చేదు నిజం మనకు మింగుడుపడని అంశం. టర్కీ మేడ్ ‘ఆసిస్‌గార్డ్ సోంగార్’ కేటగిరికి చెందిన డ్రోన్లుగా గుర్తించింది ఆర్మీ. అంటే, భూకంపం సమయంలో తుర్కియేకు సాయం చేసిన మనకు వెన్నపోటు పొడుస్తూ.. పాక్‌కు డ్రోన్లు సరఫరా చేసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. పాకిస్తాన్‌ను, తుర్కియేను కామెంట్లతో కుళ్లబొడుస్తున్నారు.
పాక్‌కు ఫుల్ సపోర్ట్
తుర్కియే మొదటినుంచీ పాక్‌కు ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌కు మద్దుతు తెలిపిన అతికొద్ది దేశాల్లో తుర్కియే ఒకటి. అంతకుముందే పాక్ కోసం భారీ యుద్ధ నౌక ‘టీజీసీ బుయుకడా’ను కరాచీ తీరానికి పంపించింది తుర్కియే. సముద్రంలో గస్తీ కాయడం, జలాంతర్గాములను గుర్తించి దాడి చేయడంలో అది ఎక్స్‌పర్ట్. ఇలా యుద్ధ నౌకలు, డ్రోన్లు, నైతిక మద్దతుతో పాకిస్తాన్‌కు బలమైన మద్దతుదారుగా నిలుస్తోంది. అలాంటి తుర్కియేకు 2013 భూకంప సమయంలో భారత్ సాయం చేయడం.. ఇప్పుడది మన దేశానికి వ్యతిరేకంగా పాక్‌కు సపోర్ట్ చేయడంపై భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెండు ముస్లిం దేశాలు కలిసి.. హిందూ కంట్రీపై దాడి చేస్తున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read : ధోనీ, సచిన్.. యుద్ధ రంగంలోకి..