E-Paper
Advertisement

మాఫియా దగ్గరున్న 8300 కోట్లు కావాలట… వీళ్ల స్కెచ్ తెలిస్తే షాక్ భయ్యా

మాఫియా దగ్గరున్న 8300 కోట్లు కావాలట… వీళ్ల స్కెచ్ తెలిస్తే షాక్ భయ్యా
Advertisement

Crime Thriller on OTT: బిలియన్ డాలర్లు… పోలీసులకు చెప్పుకోలేని అక్రమ డబ్బు… ఆ డబ్బును తిరిగి దొంగిలించేందుకు రంగంలోకి దిగిన ఇద్దరు మాజీ ఎలైట్ మిలిటరీ ఏజెంట్లు. కానీ ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు ? డబ్బు కోసం మొదలైన ఈ మిషన్ చివరకు ప్రాణాల కోసం చేసే యుద్ధంగా ఎందుకు మారింది ? చట్టానికి, నేరానికి మధ్య ఉన్న గ్రే జోన్‌లో గాయ్ రిచీ మార్క్ స్టైల్ యాక్షన్‌తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఇన్ ది గ్రే’ (In The Grey). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు? తెలుగులో ఉందా? అసలు కథేంటి? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అంతర్జాతీయ స్థాయిలో అక్రమ ఆర్థిక లావాదేవీలు సాగించే అసెట్ మేనేజర్ బాబీ షీన్ దగ్గర ఉన్న దాదాపు ఒక బిలియన్ డాలర్లను మాఫియా డాన్ మ్యానీ దొంగిలిస్తాడు. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.8,300 కోట్లకు పైమాటే. అయితే అది అక్రమంగా సంపాదించిన డబ్బు కావడంతో బాబీ నేరుగా పోలీసులను ఆశ్రయించే పరిస్థితిలో ఉండదు. డబ్బు పోయింది, కానీ చట్టం సహాయం తీసుకునే అవకాశం కూడా లేదు. దీంతో ఆమె తరఫున లీగల్ మైండ్ రాచెల్ రంగంలోకి దిగుతుంది.

Advertisement

సమస్యను పరిష్కరించడానికి రాచెల్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేస్తుంది. గతంలో జైలు నుంచి బయటపడేందుకు తనకు సహాయం చేసిన ఇద్దరు మాజీ స్పెషల్ ఫోర్స్ ఏజెంట్లు సిద్, బ్రాంకోలను సంప్రదిస్తుంది. వీళ్ళిద్దరూ ఇద్దరూ సాధారణ సైనికులు కాదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లి, చెప్పిన పని చేయగల ఎక్స్‌ట్రాక్షన్ స్పెషలిస్టులు.

ఇప్పుడు వీరి మిషన్ ఏంటంటే… మ్యానీ దగ్గర ఉన్న అదే అక్రమ డబ్బును తిరిగి దొంగిలించడం. చట్టం సహాయం చేయలేని పరిస్థితిలో, చట్టానికి పూర్తిగా విరుద్ధంగా వెళ్లకుండా తమదైన పద్ధతిలో ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుంది. అందుకే వీరి ఆపరేషన్ మొత్తం ఒక గ్రే జోన్‌లో సాగుతుంది. హ్యాకింగ్, ఫోరెన్సిక్ సాబోటేజ్, మైండ్ గేమ్స్‌తో మాఫియా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి సిద్, బ్రాంకో తమ ప్లాన్ అమలు చేస్తారు.

Advertisement

కానీ అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. మ్యానీకి కేవలం క్రిమినల్ నెట్‌వర్క్ మాత్రమే కాకుండా, కొంతమంది అవినీతి ప్రభుత్వ అధికారుల మద్దతు కూడా ఉందని బయటపడుతుంది. దీంతో ఒక మనీ రికవరీ ఆపరేషన్ కాస్తా పెద్ద యుద్ధంగా మారుతుంది. పరిస్థితులు మరింత విషమించడంతో రాచెల్ కూడా మాఫియా చేతికి చిక్కుతుంది. ఇక ఆమెను కాపాడటంతో పాటు డబ్బును తిరిగి సంపాదించడం సిద్, బ్రాంకోలకు డబుల్ మిషన్‌గా మారుతుంది. మాఫియా సామ్రాజ్యంలోకి దూసుకెళ్లిన ఈ ఇద్దరు మాజీ ఏజెంట్లు తమ యాక్షన్ స్కిల్స్‌తో శత్రువులను ఎలా ఎదుర్కొన్నారు? రాచెల్‌ను ఎలా రక్షించారు? చివరకు రూ.8,300 కోట్లను తిరిగి రికవర్ చేశారా? అనేదే మిగిలిన కథ.

తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడ ?

‘ఇన్ ది గ్రే’లో హెన్రీ కావిల్, జేక్ గిల్లెన్‌హాల్, ఈజా గొంజాలెజ్, రోసమండ్ పైక్, కార్లోస్ బార్డెమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గాయ్ రిచీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 2026 మే 15న థియేటర్లలో విడుదలై, అనంతరం డిజిటల్‌ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, స్టైలిష్ యాక్షన్, మాఫియా గేమ్స్, హెన్రీ కావిల్, జేక్ గిల్లెన్‌హాల్ కాంబినేషన్‌ను ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయవచ్చు.

Read Also: అడవిలో వీకెండ్‌కి వెళ్లిన అమ్మాయి… తెల్లారేసరికి వ్యాన్‌లో బందీ… ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×