Shahrukh Khan:వాణిజ్య ప్రకటనలు సెలబ్రిటీలతో చేయిస్తే.. అవి ప్రజలపై ఎంత ప్రభావితం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కొంతమంది సెలబ్రిటీలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన కొన్ని యాడ్స్ ను తిరస్కరిస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాన్ మసాలా, గుట్కా, ఖైనీ వంటి యాడ్స్ ను చేస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు ఇక అలాంటి జాబితాలోకి పలువురు బాలీవుడ్ స్టార్లు వచ్చి చేరారు. ప్రజల ప్రాణాలకు హానికరమైన పాన్ మసాలా చ్యూయింగ్ ఇలాచీ బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు గానూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ బాలీవుడ్ ప్రముఖ నటులు షారుక్ ఖాన్ (Shahrukh Khan), అజయ్ దేవగన్(Ajay Devagan), టైగర్ ష్రాఫ్ (tiger Shroff) లకు షాక్ ఇచ్చింది.
ఆగస్టు 14న ఎఫ్డిఏ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ యాడ్స్ 2006 ఎఫ్ ఎస్ ఐ చట్టాన్ని , దాని సవరించిన నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఎఫ్డిఏ తన నోటీసుల్లో పేర్కొంది.విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్రలో నిషేధించబడిన పాన్ మసాలా , గుట్కా, టొబాకో ఉత్పత్తులను పోలిన బ్రాండ్ పేరుతో ఇలాచీని ప్రచారం చేయడం ద్వారా పరోక్షంగా నిషిద్ధ ఉత్పత్తులను ప్రమోట్ చేసినట్లు ఎఫ్డిఏ గుర్తించింది. అజయ్ దేవగన్ కు జుహులోని ఆయన నివాసంలో, షారుక్ ఖాన్ కు బాంద్రా లోని మన్నత్, టైగర్ ష్రాఫ్ కు ఆయన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ షోకాజ్ నోటీసులు అందజేశారు. సోషల్ మీడియా , అలాగే ఇతర ప్లాట్ ఫామ్ ల నుంచి ఆ ప్రమోషనల్ కంటెంట్ ను తొలగించాలని , దీనిపై తమ వివరణను 15 రోజుల్లోగా సమర్పించాలని ఎఫ్డిఏ ఈ నటులను ఆదేశించింది. నిబంధనలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది.
ఇలాంటి సమయంలో షారుక్ ఖాన్ పాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ..” ప్రజలకు హాని కలిగించే ఉత్పత్తుల నుంచి ప్రభుత్వానికి ఆదాయం పోకూడదు. కానీ మాలాంటి వ్యక్తులకు ఆదాయం రానివ్వకూడదు” అంటూ షారుక్ ఖాన్ సూటిగానే నిలదీశారు. సిగరెట్లు, కోలాలతో ప్రజలకు ప్రమాదం ఉంటే వాటిని నిషేధించాలి కదా? అంటూ కూడా ప్రశ్నించారు. ప్రభుత్వానికి అయితే ఒక రూల్, ప్రజలకైతే మరో రూల్ ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు.
ALSO READ:కళ్యాణ్ రామ్ భయాన్ని పోగొడతానంటున్న అనిల్ రావిపూడి!
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ సాగుతోంది. అసలు హాని కలిగించే ఏ ఉత్పత్తిని ప్రభుత్వం క్షమించకూడదు. గంజాయి , ఓపియం, నల్లమందు వంటి వాటిని బ్యాన్ చేయాలి. సిగరెట్లకు ధర పెంచినంత మాత్రాన వాటిని కాల్చడం ఆపేస్తారా? కాబట్టి మొదలునే తుంచేస్తే చిగురు అనేది పుట్టదు కదా.. మొదలు నరికేసిన చిగుళ్ళు పుట్టుకొస్తాయి అలా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ షారుక్ ఖాన్ సూచించారు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ప్రభుత్వానికి విసిరిన సూటి ప్రశ్నకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే మరొకవైపు షారుఖ్ ఖాన్ కి ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడే కానీ తనలో మార్పు రావడం లేదు అతడికి డబ్బే ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు