E-Paper
Advertisement

డెలివరీకి ముందు రాత్రే గర్భిణిపై సైకో దాడి… క్లైమాక్స్ చూస్తే గుండె ఆగిపోతుంది

డెలివరీకి ముందు రాత్రే గర్భిణిపై సైకో దాడి… క్లైమాక్స్ చూస్తే గుండె ఆగిపోతుంది
Advertisement

Psychological Horror Thriller on OTT : గర్భవతిగా ఉన్న ఓ మహిళ… ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ అపరిచిత మహిళ అర్థరాత్రి తలుపు తడుతుంది. మొదట సహాయం కోసం వచ్చినట్లు కనిపించిన ఆమె అసలు ఉద్దేశం తెలిసే సరికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకే ఇంట్లో జరిగే ఈ బ్లడీ బ్లడ్ బాత్ హారర్ కథ ప్రపంచవ్యాప్తంగా హారర్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అదే ఫ్రెంచ్ హారర్ క్లాసిక్ ‘ఇన్‌సైడ్’ (Inside – 2007). “న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ” జానర్‌లో వచ్చిన ఈ చిత్రం అత్యంత హింసాత్మక హారర్ సినిమాల్లో ఒకటిగా ఇప్పటికీ గుర్తింపు పొందుతోంది. మరి ఈ భయంకరమైన సినిమాను తెలుగులో ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సారా అనే యువ ఫొటోగ్రాఫర్ తొమ్మిది నెలల గర్భిణి. కొద్ది నెలల క్రితం జరిగిన ఘోరమైన కారు ప్రమాదంలో ఆమె భర్త మరణిస్తాడు. అదృష్టవశాత్తూ సారా, ఆమె గర్భంలోని శిశువు మాత్రం ప్రాణాలతో బయటపడతారు. ఆ విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, క్రిస్మస్‌కు ముందు రాత్రి డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.

Advertisement

అదే రాత్రి ఒక అపరిచిత మహిళ ఇంటి తలుపు తట్టి ఫోన్ ఉపయోగించుకోవాలని అడుగుతుంది. సారా తలుపు తీయడానికి నిరాకరించడంతో, ఆ మహిళకు సారా వ్యక్తిగత జీవితం, ఆమె భర్త మరణం వంటి విషయాలన్నీ తెలుసన్న విషయం బయటపడుతుంది. దీంతో భయపడిన సారా పోలీసులకు సమాచారం ఇస్తుంది. పోలీసులు వచ్చి పరిశీలించినా ఎవరూ కనిపించకపోవడంతో వెళ్లిపోతారు. కానీ అసలు భయం అప్పుడే మొదలవుతుంది.

రాత్రి మరింత గడిచాక ఆ మహిళ రహస్యంగా ఇంట్లోకి చొరబడి నిద్రలో ఉన్న సారాపై దాడి చేస్తుంది. మొదట ఆమె సారాను చంపాలనుకుంటోందని అనిపించినా, కొద్దిసేపటికే ఆమె అసలు లక్ష్యం సారా కడుపులోని బిడ్డ అని తెలిసి షాక్ తగులుతుంది. ప్రాణభయంతో సారా బాత్‌రూమ్‌లో దాక్కుంటుంది. బయట మాత్రం ఆ సైకో మహిళ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిపై అత్యంత దారుణంగా దాడి చేస్తూ భయంకరమైన పరిస్థితిని సృష్టిస్తుంది.

Advertisement

సారాను రక్షించడానికి ఆమె తల్లి, స్నేహితులు, పోలీసులు ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకుంటారు. కానీ ఆ మహిళ క్రూరత్వం ముందు ఎవరూ నిలబడలేరు. ఒకే ఇంట్లో జరిగే ఈ రక్తపాత పోరాటం క్రమంగా మరింత భయంకరంగా మారుతుంది. అసలు ఆ మహిళ ఎవరు ? సారా బిడ్డను ఎందుకు కావాలనుకుంది ? నాలుగు నెలల క్రితం జరిగిన ప్రమాదానికి ఈ ఘటనకు ఉన్న సంబంధం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానం క్లైమాక్స్‌లో బయటపడుతుంది. ఆ చివరి 20 నిమిషాలు హారర్ అభిమానులను తీవ్రంగా కలవరపెడతాయి.

Also Read : 18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

తెలుగులో ఉందా ?

సాధారణ దెయ్యాల కథలకంటే భిన్నంగా, ఒక సైకో మహిళతో జరిగే హోమ్ ఇన్వేజన్ హారర్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా చూపించే చిత్రం ఇది. సినిమా మొత్తం దాదాపు ఒకే ఇంట్లో సాగినా ఎక్కడా బోర్ కొట్టదు. హారర్, సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ అంశాలను దర్శకులు జూలియన్ మౌరీ, అలెగ్జాండర్ బుస్టిల్లో చాలా ఇంటెన్స్‌గా చూపించారు. అయితే ఇందులో అత్యంత హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఇది పెద్దలకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఫ్రెంచ్ ఒరిజినల్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ ఆడియోతో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. అత్యంత భయంకరమైన హోమ్ ఇన్వేజన్ హారర్ సినిమాలు చూడాలనుకునే వారికి మంచి హర్రర్ ట్రీట్ అవుతుంది. హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు చూడొద్దు. హారర్‌లో రియలిస్టిక్ టెన్షన్, క్రూరమైన హింస, చివరి వరకు ఉత్కంఠ కావాలనుకుంటే ఈ ఫ్రెంచ్ క్లాసిక్ నిరాశపరచదు.

Related News

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×