OTT Movie : ఇప్పుడు టెక్నాలజీ బాగా అందుబాటులో ఉండటంతో, ఎక్కడ చూసినా షార్ట్ ఫిలిం లు హోరెత్తిస్తున్నాయి. సెల్ ఫోన్ తోనే వీటిని తీస్తూ తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. చిన్న పిల్లలతో మొదలుపెట్టి, వృద్ధుల వరకు వీటిని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే వీటికి జాతీయ అవార్డులు కూడా దక్కుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిలింను సామాజిక కళలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించారు జాతీయ అవార్డు గ్రహీతలు. ఈ షార్ట్ ఫిలిం ఒక ముస్లిం కుటుంబం చుట్టూ తిరుగుతుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
ఈ బెంగాలీ షార్ట్ ఫిల్మ్ పేరు’కాయాంతర్’ (Kayantar). 2020లో విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్ ను జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకులు సర్మిష్ఠా మైతీ, రాజ్‌దీప్ పాల్ రూపొందించారు. ఈ స్టోరీ గ్రామీణ బెంగాల్‌లోని సాంస్కృతిక కళల నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో కళ, మతం, లింగ భేదాలు, సామాజిక సమస్యలను చక్కగా తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ బెంగాల్‌లోని ఒక ముస్లిం కుటుంబంలో జరుగుతుంది. 2019 లో వుడ్‌పెకర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సామాజిక సమస్యల చిత్రంగా ఇది గుర్తింపు పొందింది. 30 నిమిషాలు ఉండే ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఒక ముస్లిం కుటుంబం సాంప్రదాయం గా వస్తున్న (బెహ్రుపియాస్) అనే ఒక కళను ప్రదర్శనలు ఇస్తుంటారు. ముఖ్యంగా పురుష కళాకారులు, హిందూ దేవతలు, దేవతామూర్తుల రూపంలో ప్రదర్శనలు ఇస్తారు. తరచూ మతపరమైన ఉత్సవాల్లో భాగంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ సాంప్రదాయ కళకు పోషణ తగ్గడంతో, వారు దారిద్య్రంలో మునిగిపోతున్నారు. ఒక ముస్లిం కుటుంబంలో ఆసియా, ఆమె సోదరుడు అస్లామ్ ఉంటారు. ఆసియా తన తండ్రి కళను అనుసరించి, కాళీ దేవత రూపంలో ప్రదర్శన ఇవ్వాలని కలలు కంటుంది. కానీ ఈ సంప్రదాయం స్త్రీలకు నిషిద్ధం కావడంతో ఆమె కలలు నిరాశకు గురవుతాయి. మరోవైపు ఈ వృత్తిని అవమానకరంగా భావించే అస్లామ్‌ను తండ్రి బలవంతంగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించమని ఒత్తిడి చేస్తాడు. ఈ నేపథ్యంలో మతపరమైన ఛాందసవాదం, సామాజిక అంశాలు కుటుంబంపై ప్రభావం చూపుతాయి. ఆసియా తన కళాత్మకత మీద ఉండే మక్కువ తో, ఎలాగైనా ఈ సంప్రదాయాన్ని చేపట్టాలని స్వేచ్ఛ కోసం పోరాడుతుంది. అయితే సమాజంలోని లింగ భేదాలు, మతపరమైన అడ్డంకులు ఆమె కలలను అడ్డుకుంటాయి. చివరికి ఈ సంప్రదాయాన్ని ఈ కుటుంబం కొనసాగిస్తుందా ? లేకపోతే వదులుకుంటుందా ? అనేది ఈ షార్ట్ ఫిల్మ్ చూసి తెలుసుకోండి.
Read Also : రాజకీయాలలో అబద్ధాల హరిశ్చంద్రుడు … పొట్ట చెక్కలయ్యేలా ఉందయ్యా ఈ సిరీస్ ని చూస్తే