E-Paper
Advertisement

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?
Advertisement

Irumudi Movie OTT:మాస్ మహారాజా రవితేజ (Raviteja )హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివా నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఇరుముడి’ థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా, బేబీ నక్షత్ర చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే జోరును కొనసాగిస్తోంది. థియేటర్ల వద్దే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ గ్లోబల్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ ట్రెండింగ్ :

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా సెప్టెంబర్ 18, 2026 నుంచి ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం నాన్-ఇంగ్లీష్ మూవీస్ కేటగిరీలో గ్లోబల్ లెవెల్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇక భారత్‌తో పాటు మరో 11 దేశాల్లో టాప్-10 సినిమాల జాబితాలో నిలవడం విశేషం. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ నుంచి వస్తోన్న అద్భుతమైన స్పందనతో ఈ మూవీ వ్యూస్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఐదు భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ :

Advertisement

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతుండటంతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ చిత్ర కథాంశంపై రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ, వ్యూస్ విషయంలో మాత్రం ఎలాంటి తగ్గడమూ లేదు.

also read:సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

తండ్రీకూతుళ్ల భావోద్వేగాల ప్రయాణం:

Advertisement

అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో పాటు తండ్రి, కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. రవితేజ నటన, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయికుమార్ వంటి నటీనటుల ప్రతిభ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కంటతడి పెట్టించిన ఈ సెంటిమెంట్, ఇప్పుడు ఓటీటీ ప్రియులను కూడా కట్టడి చేస్తోంది.

ఇక సినిమా థియేట్రికల్ రన్‌ ముగిసినా, ఓటీటీలో మాత్రం ‘ఇరుముడి’ తన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గనివ్వడం లేదు. గ్లోబల్ వైడ్‌గా వస్తోన్న ఆదరణ చూస్తుంటే మాస్ మహారాజా స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఇక వీకెండ్‌లో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసేయాలనుకునేవారికి ఈ మూవీ పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.

రవితేజ తదుపరి చిత్రాలు..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన రవితేజకి ఇరుముడి సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది ఇప్పుడు అదే జోష్ తో డైరెక్టర్ హసిత్ గోలీతో ఒక కొత్త ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, ఆయన సోదరుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హార్డ్ కోర్ ఎంటర్టైనర్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరో డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేస్తున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ కు చెందిన లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related News

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×