E-Paper
Advertisement

జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తే… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్… ఈ హారర్ చూస్తే మైండ్ బ్లాక్

జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తే… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్… ఈ హారర్ చూస్తే మైండ్ బ్లాక్
Advertisement

Supernatural Horror Series: సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌, సైకలాజికల్ థ్రిల్లర్‌, టీనేజ్ డ్రామా కలగలిపిన కథలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఒక చిన్న సంఘటనతో మొదలై, ఆ తర్వాత ఊరంతా భయాందోళనలకు గురయ్యేలా చేసే కథాంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. అలాంటి మైండ్ బ్లాక్ కాన్సెప్ట్ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్లకు రాబోయే రోజుల్లో జరగబోయే ప్రమాదాలు మనకు ముందే కనిపిస్తే ఎలా ఉంటుందనే ఒళ్లు గగుర్పొడిచే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సరికొత్త ఇంటర్నేషనల్ హారర్ సస్పెన్స్ సిరీస్ ‘The Body: Season 1’. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ డార్క్ యాక్షన్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ లో దుమ్మురేపుతోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సరికొత్త హారర్ థ్రిల్లర్ ని అస్సలు మిస్ అవ్వకండి.

స్టోరీ ఏమిటంటే ?

ఈ కథ 2004వ సంవత్సరంలో ఒక ప్రైవేట్ క్యాథలిక్ హైస్కూల్ నేపథ్యంలో జరుగుతుంది. స్కూల్ డ్యాన్స్ టీమ్ కెప్టెన్ అన్య, కొత్తగా వచ్చిన లిస్బెత్, ఇంకా గ్రేస్ అనే అమ్మాయిలు హాలోవీన్ పార్టీ రోజున “డెవిల్స్ హౌస్” అనే పాడుబడిన ఇంటికి వెళ్తారు. అక్కడ సరదా కోసం దెయ్యాన్ని పిలిచే ఒక చిన్న రిచ్యువల్ చేస్తారు. కానీ ఆ సమయంలో గ్రేస్‌కు ఏదో వింత జరుగుతుంది. ఆ రోజు తర్వాత నుండి ఆ అమ్మాయిలకు భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన విషయాలు కలల్లాగా, వింత దృశ్యాల్లాగా కనిపించడం మొదలవుతాయి.

Advertisement

ఈ విషయాన్ని అమ్మాయిలు ఎవరికీ తెలియకుండా దాచాలని చూస్తారు, కానీ అది కాస్తా ఊరంతా పాకిపోతుంది. వారికి కనిపిస్తున్న ఈ వింత దృశ్యాల గురించి తెలిసి ఆ చిన్న పట్టణంలోని ప్రజలందరూ భయంతో వణికిపోతారు. ఈ గందరగోళం మధ్య అమ్మాయిల స్నేహంలో కూడా గొడవలు మొదలవుతాయి. అన్య తన డామినేషన్‌ను కాపాడుకోవాలని చూస్తుంటే, లిస్బెత్ తన సొంత అవసరాల కోసం అన్యను వాడుకుంటుంది. మరోవైపు ఎలిస్ అనే అమ్మాయి అన్యను ఇష్టపడుతూ, తనను అందరూ గుర్తించాలని ఆరాటపడుతుంది. ఇలా ఎవరి స్వార్థం వారిది అన్నట్లుగా పరిస్థితి మారుతుంది.

ఇక గ్రేస్ బాబాయి, ఆ స్కూల్ ఫాదర్ అయిన ఫ్రాంక్లిన్ అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతారు. ఒకవైపు మతపరమైన భయాలు, మరోవైపు టీనేజ్ పిల్లల మధ్య ఉండే ఈర్ష్యలు, పుకార్లు కలిసి ఆ ఊరిని అల్లకల్లోలం చేస్తాయి. ఆ అమ్మాయిలు చేసిన ఆ చిన్న తప్పు వల్ల వారి జీవితాలు ఎలా చిన్నాభిన్నమయ్యాయి, చివరికి అసలు నిజం బయటపడిందా లేదా అనేదే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ కథ. డార్క్ హ్యూమర్‌, సైకలాజికల్ డ్రామా, సూపర్ నేచురల్ అంశాలు కలిసిన ఈ సిరీస్ హారర్‌తో పాటు డిఫరెంట్ కథలు ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

Advertisement

ఈ సిరీస్‌లో క్రిస్టినా బోగిక్, గీనా మెసారోస్, సారా బౌస్తానీ ప్రధాన పాత్రల్లో నటించారు. క్విన్ షెపర్డ్ ఈ సిరీస్‌ను రూపొందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ 2026 నవంబర్ 11 నుంచి Netflixలో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ దీనిని ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు ఆడియో డబ్బింగ్ ఆప్షన్ తో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. ఊహించని మలుపులతో ఈ సిరీస్ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుంది. డార్క్ అట్మాస్ఫియర్ హారర్ లవర్స్ కి ప్రాపర్ గూస్‌బంప్స్ తప్పకుండా వస్తాయి. ఈ సిరీస్ ను రాత్రి పూట ఒంటరిగా రూమ్ లో లైట్లు ఆపేసి చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

Read Also: అణు యుద్ధం జరిగి 200 ఏళ్లు… ముఖం లేని హీరో మాస్ జాతర… ‘మీర్జాపూర్’ను మించిన డైలాగులు

Tags

Related News

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

మూతబడిన వాటర్ పార్క్ లో స్టూడెంట్స్ ట్రిప్… దెయ్యం ఎంట్రీతో దిమాక్ కరాబ్… నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

విడిపోయిన రాక్‌ బ్యాండ్‌ రీఎంట్రీ… మేఘాలయలో జరిగిన విషాదంతో ఊహించని మలుపు… మ్యూజికల్‌ ఎమోషనల్‌ డ్రామా

ఉంగరం కోసం సౌరాన్‌ వేట… ఎల్వ్స్, ఓర్క్స్‌ మధ్య భీకర పోరు… ‘ది రింగ్స్ ఆఫ్ పవర్’ కొత్త సీజన్ వచ్చేసిందోచ్

రాతియుగంలో మోటు-పత్లూ రోలర్ కోస్టర్ రైడ్… డైనోసార్లు, వింత మనుషులతో అల్టిమేట్ అడ్వెంచర్… 8 భాషల్లో స్ట్రీమింగ్

కోటీశ్వరుడి కొడుకు హత్య… రంగంలోకి దిగే 242 ఐక్యూ ఉన్న లేడీ డిటెక్టివ్‌… క్రిమినల్స్ కు దబిడి దిబిడే

తప్పుల్ని సరిచేసుకోవడానికి ఏడాది వెనక్కి వెళ్లే అద్భుతమైన అవకాశం… కొరియన్‌ టైమ్‌ ట్రావెల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ సిరీస్‌

Big Stories

Advertisement
×