E-Paper
Advertisement

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!
Advertisement

Director Pradeep Reddy advaitham: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను అఘాతంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో పేరు మోసిన డైరెక్టర్ భార్య అకాల మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు? ఆ డైరెక్టర్ ఎవరు? ఆమె మరణానికి గల కారణం ఏమిటి? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి అద్వైతం భార్య కన్నుమూత..

విలక్షణ కథాంశాలతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ప్రదీప్ రెడ్డి అద్వైతం (Pradeep Reddy advaitham) భార్య, ప్రముఖ వ్యాపారవేత్త దీప్తి రెడ్డి మాడుగుల(Deepthi Reddy madugula) హఠాత్తుగా కన్నుమూశారు.. గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడిన ఆమె శనివారం (సెప్టెంబర్ 26) సాయంత్రం తుదిశ్వాస విడవడంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

ప్రదీప్ భార్య దీప్తి రెడ్డి మరణానికి కారణం?

Advertisement

గత ఐదు రోజుల క్రితం దీప్తి రెడ్డి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. నిపుణులైన వైద్య బృందం ఆమెకు అత్యవసర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లభించలేదు. దీప్తి రెడ్డి మరణంతో ప్రదీప్, వారి పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈమె మరణ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, ప్రదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

also read:బిగ్ బాస్ దేబ్‌జనీ నటించిన సినిమాలివే.. అలాంటి సీన్లు చేస్తుందని అస్సలు ఊహించి వుండరు!

చావులో కూడా మరొకరికి సహాయం..

Advertisement

దీప్తి రెడ్డి ఒక బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు ఆదర్శవంతమైన మహిళ కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత. మహిళా సాధికారత కోసం నిరంతరం పరితపించే ఆమె.. ఎంతోమంది యువతులకు ఔత్సాహిక మహిళలకు స్వయం ఉపాధి , ఆర్థిక స్వావలంబన దిశగా మార్గదర్శనం చేస్తూ ఎంతో మందికి భరోసా ఇచ్చారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలంటే ఎనలేని మక్కువ. తెలంగాణ జీవన సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఏటా కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఘనంగా నిర్వహించేవారు.

మహిళల కోసం ‘ఉమెనర్జీ’..

ముఖ్యంగా ‘ఉమెనర్జీ’ అనే సంస్థను స్థాపించి , దీని ద్వారా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించారు. మహిళా స్టార్టర్ కోసం తెలంగాణ ఏంజిల్స్ ప్రారంభించి, ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచిన ఈమె చేసిన విశేష కృషికి గాను 2025లో ప్రతిష్టాత్మక ‘మాతృ శక్తి అవార్డు’ కూడా లభించింది. ఇకపోతే ఆమె మరణం లో కూడా తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారని తెలియడంతో .. గతంలో ఈమె తీసుకున్న అవయవదాన ప్రతిజ్ఞను కుటుంబ సభ్యులు గౌరవించారు. విరాట్ ఫౌండేషన్ సహకారంతో జీవన్ దాన్ ద్వారా తన అవయవాలను దానం చేసి మరి కొంత మంది జీవితాలలో వెలుగులు నింపారు.

మహాప్రస్థానంలో అంత్యక్రియలు:

ఇలాంటి గొప్ప మహిళ మరణాన్ని మహిళా పారిశ్రామికవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే హైదరాబాదులోని ఫిలింనగర్లో మహాప్రస్థానంలో సెప్టెంబర్ 27న ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related News

మిస్టర్ బీస్ట్‌తో రణ్‌బీర్.. ‘జై శ్రీరామ్’ అనిపించిన హీరో!

హిట్లర్ అనుకున్నా కానీ LKG పిల్లాడు..మోహన్ బాబు పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

కొబ్బరి మట్ట తర్వాత మోగని ఫోన్.. ప్యారడైజ్‌తో మళ్లీ మోగింది..సంపూర్ణేష్

శ్రీకాంత్ ఓదెలను దాసరితో పోల్చిన మోహన్ బాబు.. గ్రేట్ డైరెక్టర్ అంటూ!

ఇండస్ట్రీ ఎవడి అబ్బా సొత్తు కాదు.. మోహన్ బాబు కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!

మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×