E-Paper
Advertisement

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్
Advertisement

British Horror Movie: చిన్నప్పుడు మనం ప్రేమగా చూసిన పినోచియోనే ఒక రక్తపాత హారర్ విలన్‌ గా మారితే ? మనిషిగా మారాలని కోరుకున్న చెక్క బొమ్మ… అదే కోరికతో మనుషుల శరీర భాగాలనే తనకు అమర్చుకుంటే ? పైగా తనకు నచ్చని వాళ్లను ఒక్కొక్కరినీ దారుణంగా చంపడం మొదలుపెడితే పరిస్థితి ఎలా ఉంటుంది ? పినోచియో కథను పూర్తిగా డార్క్ హారర్, స్లాషర్ మూవీగా మార్చిన ‘పినోచియో అన్‌స్ట్రంగ్’ (Pinocchio Unstrung) ఇలాంటి భయానక ఆలోచనతోనే తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? తెలుగులో చూడొచ్చా ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జేమ్స్ అనే 14 ఏళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ విషాదం నుంచి బయటపడకముందే అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా క్యాన్సర్‌ తో చనిపోతాడు. దీంతో పూర్తిగా ఒంటరిగా మారిన జేమ్స్‌ ను లండన్‌ లోని తన తాత గెప్పెట్టో దగ్గరకు పంపిస్తారు. అయితే సాధారణ కార్పెంటర్‌ గా కనిపించే గెప్పెట్టో వెనుక మరో రహస్యం ఉంటుంది. అతను వింత ప్రయోగాలు చేసే సైంటిస్ట్. మనవడి బాధను చూసి జేమ్స్‌ కు తోడుగా ఉండేందుకు గెప్పెట్టో ఓ ప్రాణమున్న చెక్క బొమ్మను తయారు చేస్తాడు. దానికి పినోచియో అని పేరు పెడతాడు. అయితే ఆ బొమ్మను ఇంటి బయటకు ఎప్పుడూ తీసుకెళ్లకూడదని జేమ్స్‌ కు గట్టిగా చెబుతాడు. కానీ ఆసక్తితో జేమ్స్ పినోచియోను స్కూల్‌ కు తీసుకెళ్తాడు.

Advertisement

అక్కడ జేమ్స్‌ ను కొంతమంది విద్యార్థులు వేధించడం పినోచియో చూస్తాడు. మనుషుల్లోని క్రూరత్వాన్ని గమనిస్తున్న కొద్దీ అతని ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. దీనికి తోడు ఓ దుష్టమైన క్రికెట్ పినోచియోను మరింత తప్పుదోవ పట్టిస్తుంది. జేమ్స్‌ కు హాని చేసే వాళ్లందరినీ అంతం చేయాలనే నిర్ణయానికి వస్తాడు. అక్కడి నుంచి మొదలయ్యేది అసలు రక్తపాతం. పినోచియో ఒక్కొక్కరినీ దారుణంగా చంపుతూ వెళ్తాడు. అంతేకాదు తాను కూడా నిజమైన మనిషిలా మారాలనే కోరికతో చనిపోయిన వారి శరీర భాగాలను సేకరించి తన చెక్క శరీరానికి అమర్చుకోవడం మొదలుపెడతాడు.

స్కూల్‌ తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అతని హత్యలు భయానకంగా మారతాయి. క్లైమాక్స్‌ లో గెప్పెట్టో దాచిన అసలు రహస్యం బయట పడుతుంది. పినోచియో తయారీలో జేమ్స్ చనిపోయిన స్నేహితుడి శరీర భాగాలను కూడా ఉపయోగించాడనే విషయం తెలుస్తుంది. అసలు పినోచియోను ఆపగలరా ? జేమ్స్, గెప్పెట్టో ఏం చేశారు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

‘పినోచియో అన్‌స్ట్రంగ్’ హారర్, స్లాషర్ జానర్‌ లో రూపొందిన బ్రిటిష్ ఇండిపెండెంట్ సినిమా. Rhys Frake-Waterfield దర్శకత్వం వహించారు. Richard Brake గెప్పెట్టోగా, Cameron Bell జేమ్స్‌గా నటించగా, Robert Englund క్రికెట్‌కు వాయిస్ అందించారు. చిన్ననాటి ఫేమస్ పాత్రలను భయానక విలన్లుగా మార్చే Twisted Childhood Universeలో ఇది భాగం. ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. సాధారణ పినోచియో కథను మర్చిపోయి పూర్తిగా రక్తపాతంతో కూడిన హారర్ చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.

Read Also: విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

Related News

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

ఉన్నట్టుండి పుట్టుకొచ్చే వింత పుట్టగొడుగులు… ఊళ్ళో జనాల విచిత్ర ప్రవర్తన… ఉత్కంఠ రేపే మలయాళం సర్ప్రైజ్ హిట్

చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

ఖాకీ డ్రెస్‌కి, క్రైమ్ సామ్రాజ్యానికి మధ్య సాగే రక్తపాతం… ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ అండ్ మైండ్ గేమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×