E-Paper
Advertisement

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా
Advertisement

Spanish Dark Comedy Movie: ఒకప్పుడు దేశంలోనే టాప్ చీజ్ కంపెనీగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఉద్యోగుల్లో ఉత్సాహం పెంచేందుకు మేనేజ్‌మెంట్ టీమ్ బిల్డింగ్ పేరుతో అందరినీ ఓ పల్లెటూరికి తీసుకెళ్తే ఏం జరుగుతుంది ? సరదాగా గడపాల్సిన ఆ వీకెండ్‌ లోనే భారీగా ఉద్యోగులను తొలగించబోతున్నారనే విషయం బయటపడితే ? తమ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఒకరిపై ఒకరు పోటీ పడుతూ, బాస్‌ లను ప్రసన్నం చేసుకుంటూ, చివరికి సొంత కొలీగ్స్‌ కే వెన్నుపోటు పొడిచే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది ? ఇలాంటి విచిత్రమైన ఆఫీస్ వార్‌ ను డార్క్ కామెడీతో చూపించే సినిమా ‘గో టీమ్!’ (Go Team!). మరి ఈ మూవీని తెలుగులో చూడొచ్చా ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

స్పెయిన్‌ లో ఒకప్పుడు నంబర్ వన్ చీజ్ తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఓ కంపెనీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంటుంది. అమ్మకాలు పడిపోవడం, ఆదాయం తగ్గిపోవడంతో కంపెనీ భవిష్యత్తుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలవుతుంది. ఈ సమయంలో ఉద్యోగుల మధ్య టీమ్ స్పిరిట్ పెంచి, సంస్థను మళ్లీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఓ టీమ్ బిల్డింగ్ వీకెండ్‌ ను ప్లాన్ చేస్తుంది. కంపెనీ మొదలైన పల్లెటూరికే ఉద్యోగులందరినీ తీసుకెళ్లి, అక్కడ వివిధ గేమ్స్‌, టీమ్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు. మొదట్లో ఇదంతా సరదాగా అనిపిస్తుంది. కొంతమంది ఉద్యోగులు పాత విషయాలను మర్చిపోయి కలిసి పని చేయాలని ప్రయత్నిస్తారు.

Advertisement

కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. వీకెండ్ పూర్తయ్యేలోపే కంపెనీలో భారీగా లేఆఫ్స్ ఉండబోతున్నాయనే విషయం ఉద్యోగులకు తెలుస్తుంది. దీంతో అప్పటి వరకు టీమ్‌ గా కనిపించిన వాళ్లంతా ఒక్కసారిగా ప్రత్యర్థులుగా మారిపోతారు. ఎవరి ఉద్యోగం పోతుందో, ఎవరు కంపెనీలో మిగులుతారో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాస్‌ ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం కొందరు సహోద్యోగులపై ఫిర్యాదులు చేస్తారు. మరికొందరు తమ పని తీరును గొప్పగా చూపించేందుకు ఇతరులను తక్కువ చేసి మాట్లాడతారు.

స్నేహితులుగా ఉన్నవాళ్లే అవసరం కోసం ఒకరినొకరు మోసం చేయడం మొదలు పెడతారు. అలా టీమ్ బిల్డింగ్ కోసం మొదలైన వీకెండ్ కాస్తా ఉద్యోగాల కోసం జరిగే యుద్ధంగా మారిపోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్ డ్రామాలా కాకుండా వ్యంగ్యంతో, నల్లటి హాస్యంతో చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కార్పొరేట్ ప్రపంచంలో కనిపించే ఆఫీస్ పాలిటిక్స్, ఉద్యోగ భద్రతపై భయం, బాస్‌ ను మెప్పించే ప్రయత్నాలు, కొలీగ్స్ మధ్య పోటీ వంటి విషయాలను సినిమాలో సరదాగా చూపించారు.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

‘గో టీమ్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, స్పానిష్ భాషల్లో చూడొచ్చు. ఆఫీస్ పాలిటిక్స్‌, డార్క్ కామెడీ, కార్పొరేట్ కల్చర్‌ పై సెటైరికల్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది మంచి టైమ్‌పాస్ మూవీగా నిలుస్తుంది.

Read Also: విలన్‌తో అమాయకపు అమ్మాయి బాడీ స్వ్యాప్… భయపెట్టే కామెడీ రోలర్‌కోస్టర్ రైడ్

Tags

Related News

సిటీ డాక్టర్ పై మనసు పడే విలేజ్ కుర్రాడు… ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా

ది గ్రేట్ పంజాబ్ రాబరీ… సినిమాను తలపించే రియల్ హీస్ట్… గూస్‌బంప్స్ గ్యారెంటీ

ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

వందల ఏళ్ల రాజభవనం.. అప్పులపాలైన రాజవంశం… వైభవం నుంచి పతనం వరకు కంటతడి పెట్టించే మాస్టర్ పీస్

నవ్వినా అవుట్‌… భయపడినా అవుట్‌… హాలోవీన్‌ హంగామాలో అన్‌స్టాపబుల్ కామెడీ

ఓటీటీ విడుదలకు సిద్ధమైన సీఎం కొడుకు ఫస్ట్ సినిమా!

ఓడలో అమ్మాయిలనే టార్గెట్ చేసే కిల్లర్… 2000ల మందిలో హంతకుడు ఎవరు ?

ఒకే ఒక్క రాంగ్ డెసిషన్ తో బతుకు బస్టాండ్… గ్యాంగ్‌స్టర్లు, పోలీసుల మధ్య ఇరుక్కున్న కుర్రాళ్ల కథ

Big Stories

Advertisement
×