E-Paper
Advertisement

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్
Advertisement

Supernatural Medical Crime Thriller: కదల్లేని స్థితిలో కోమాలో ఉన్న ఓ మహిళ బయట ప్రపంచంతో ఎలా మాట్లాడగలదు ? ఆమె మాటలు వినగలిగే ఓ నర్స్‌ కు ఉన్న వింత శక్తి ఏంటి ? అసలు ఆ మహిళను కోమాలోకి నెట్టింది ఎవరు ? ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న ఈ మిస్టరీ వెనుక అవయవాల అక్రమ రవాణా మాఫియా ఉందని తెలిస్తే ? ఇలాంటి సూపర్ నేచురల్ అంశాలను మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌ తో కలిపి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘స్టోలెన్ హార్ట్‌బీట్స్’ (Stolen Heartbeats). మరి ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

అనాబెల్ ఓ హోటల్ ఎగ్జిక్యూటివ్. ఆమె జీవితం సాధారణంగానే సాగుతున్న సమయంలో కొందరు దుండగులు ఆమెపై దారుణంగా దాడి చేస్తారు. తీవ్రంగా గాయపడిన అనాబెల్ కోమాలోకి వెళ్లిపోతుంది. శరీరం కదలదు, నోటి నుంచి మాట రాదు. బయట ప్రపంచానికి ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయిన వ్యక్తిలానే కనిపిస్తుంది. అయితే ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో పని చేసే రాఫెల్ అనే నర్స్‌ కు సాధారణంగా ఎవరికీ లేని ఓ విచిత్రమైన శక్తి ఉంటుంది. చనిపోయిన వారి ఆత్మల నుంచి లేదా మరణానికి చేరువలో ఉన్నవారి నుంచి వచ్చే మాటలు, శబ్దాలను అతను వినగలడు.

Advertisement

ఈ శక్తే అనాబెల్‌కు ఓ అవకాశంగా మారుతుంది. తన శరీరం స్పందించకపోయినా రాఫెల్ ద్వారా ఆమె తన ఉనికిని తెలియజేయడం మొదలు పెడుతుంది. అనాబెల్ చెప్పే విషయాలతో రాఫెల్‌ కు అసలు సమస్యపై అనుమానాలు మొదలవుతాయి. ఆమెపై జరిగిన దాడి వెనుక వ్యక్తిగత శత్రుత్వం లేదని, ఆసుపత్రి చుట్టూ నడుస్తున్న పెద్ద ఆర్గన్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ తో దీనికి సంబంధం ఉందని తెలుస్తుంది. అనాబెల్ ఈ రహస్యానికి కీలక సాక్షిగా మారడంతో, ఆమె ఇంకా బతికే ఉందన్న విషయం బయటకు రాకముందే ఆమెను పూర్తిగా అంతం చేయాలని మాఫియా ప్రయత్నిస్తుంది.

కోమాలో ఉన్న అనాబెల్‌ ను కాపాడటంతో పాటు ఆ నేర సామ్రాజ్యాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత రాఫెల్‌ పై పడుతుంది. ఒకవైపు ఆసుపత్రిలోనే శత్రువులు కదులుతుంటే, మరోవైపు అనాబెల్ తనకు తెలిసిన నిజాలను రాఫెల్‌ కు చేరవేస్తుంటుంది. మరి రాఫెల్ ఆమెను ఎలా కాపాడాడు ? ఇద్దరూ కలిసి ఈ మాఫియా వెనుక ఉన్న అసలు వ్యక్తులను ఎలా బయట పెట్టారు ? అనేదే మిగతా కథ.

నెట్‌ఫ్లిక్స్‌ లో తెలుగులో ఉందా ?

Advertisement

‘స్టోలెన్ హార్ట్‌బీట్స్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో అందుబాటులో లేదు. స్పానిష్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ, జర్మన్ ఆడియో ఆప్షన్స్ ఉన్నాయి. స్పానిష్‌ లో ఈ సిరీస్‌ ను En Coma అని పిలుస్తారు. ఇది మొత్తం 50 ఎపిసోడ్‌ ల మైక్రో-డ్రామా కాగా, ఒక్కో ఎపిసోడ్ కేవలం 3 నుంచి 5 నిమిషాల నిడివితో ఉంటుంది. రామి హెర్రెరా అనాబెల్‌గా, జెరోనిమో కాంటిల్లో రాఫెల్‌ గా నటించారు. సూపర్ నేచురల్ మిస్టరీ, మెడికల్ క్రైమ్, షార్ట్ ఎపిసోడ్ ఫార్మాట్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also: జోజు జార్జ్ ఊచకోత తెలుగులోనే… నిమిషానికో మలుపు ఉన్న మలయాళం హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

Tags

Related News

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

అమ్మాయిలను చంపి పెళ్లి కూతుర్లలా అలంకరించే సైకో… సీటు అంచున కూర్చోబెట్టే ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ

ఉన్నట్టుండి పుట్టుకొచ్చే వింత పుట్టగొడుగులు… ఊళ్ళో జనాల విచిత్ర ప్రవర్తన… ఉత్కంఠ రేపే మలయాళం సర్ప్రైజ్ హిట్

చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

దేశ స్వాతంత్ర్యం కోసం ఊపిరి వదిలిన వీరుల గాథ… నరనరాల్లో దేశభక్తిని రగిలించే పవర్ ఫుల్ ఎపిక్ సిరీస్

ఐఏఎస్ ఆఫీసర్ తీర్చుకున్న షాకింగ్ ప్రతికారం… ఊహకందని పొలిటికల్ రివేంజ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×