OTT Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూడటానికి భలే ఉంటాయి. ఇటువంటి సినిమాలను యూత్ ఎక్కువగా ఇష్టపడతారు. రీసెంట్ గా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుని, ఓటీటీలోకి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మూవీ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో
ఈ రొమాంటిక్ కామెడీ మూవీ పేరు ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ (Mere Husband Ki Biwi). 2025 లో విడుదలైన ఈ మూవీకి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఇందులో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కామెడీ, గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఈ మూవీ 2025 ఏప్రిల్ 18 నుండి జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఢిల్లీకి చెందిన అంకుర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. కాలేజీలో ప్రభలీన్ కౌర్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత విడాకులు కూడా తీసుకుంటారు. ఇది జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత కూడా, ప్రభలీన్ వల్ల వచ్చిన మానసిక గాయాలతో సతమతమవుతుంటాడు. అతని వివాహం విఫలమవడానికి కారణం ప్రభలీన్ జర్నలిస్ట్ గా ఎక్కువ సమయం గడపడం, ఆధిపత్యం చెలాయించడం. దీనికి అంకుర్ అతిగా స్పందించే వైఖరి వల్ల వీరిద్దరికి విభేదాలు వస్తాయి. ఈ విడాకుల తరువాత అంకుర్ ఏ కొత్త రిలేషన్ లోనూ స్థిరంగా ఉండలేకపోతాడు. ఒక రోజు రిషికేశ్‌లో ఒక రియల్ ఎస్టేట్ డీల్ కోసం వెళ్ళినప్పుడు, అంకుర్ తన కాలేజీ స్నేహితురాలు అంతరా ఖన్నాను కలుస్తాడు. అతని సన్నిహిత స్నేహితుడు రెహాన్ కురేషీ సలహాతో, అంకుర్ అంతరాతో రిలేషన్ ప్రారంభిస్తాడు. ఇక వారిద్దరూ ప్రేమలో పడతారు. అంతరాతో విడాకుల గురించి అంకుర్ ఆమెతో చెప్పేస్తాడు. ప్రభలీన్ ఆధిపత్య ధోరణి, సర్దుబాటుతనం లేకపోవడంతో విడాకులు తీసుకున్నామని చెప్తాడు.
అయితే వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే సమయంలో ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. ప్రభలీన్ ఒక ప్రమాదంలో గాయపడి, రెట్రో గ్రేడ్ అమ్నీషియాతో బాధ పడుతుంది. దీనివల్ల ఆమె గత ఐదు సంవత్సరాల జ్ఞాపకాలను కోల్పోతుంది. డాక్టర్ సలహా మేరకు అంకుర్ ఆమెకు నిజం చెప్పకూడదని నిర్ణయిస్తాడు. ఎందుకంటే అది ఆమె ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని డాక్టర్ చెప్తాడు. దీని కారణంగా ప్రభలీన్ తన భర్త అంకుర్ అనే అనుకుంటుంది. వారు ఇంకా భార్యాభర్తలుగా ఉన్నారని నమ్ముతుంది. అంకుర్ ప్రేమని పొందడానికి ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితి అంకుర్‌ని ఒక గందరగోళ స్థితిలోకి నెట్టివేస్తుంది. ఎందుకంటే అంతరాతో కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అనుకుంటే, ప్రభలీన్ తనతో ఉన్న పాత బంధాన్ని బలంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అంకుర్ తన లైఫ్ ను ఎవరితో స్టార్ట్ చేస్తాడు ? ప్రభలీన్ కు నిజం తెలిసిపోతుందా ? వీళ్ళిద్దరూ మళ్ళీ భార్యా, భర్తలుగా కలుస్తారా ? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
Read Also : కొత్త కోడలిని మాత్రమే వెంటాడే శాపం … ఈ ఇంట్లో కాళ్ళు పెడితే కాటికే