E-Paper
Advertisement

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్
Advertisement

Mystery Thriller: మిలిటరీ స్కూల్ అంటే కఠినమైన రూల్స్, తెల్లవారుజామునే లేవడం, ఫిజికల్ ట్రైనింగ్, డిసిప్లిన్. కానీ అదే స్కూల్‌లో ఓ విద్యార్థి అదృశ్యమై, అతడి గురించి నిజం తెలుసుకోవడానికి మరో కుర్రాడు అక్కడ చేరితే? అక్కడి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ, ఫ్రెండ్ అదృశ్యం వెనుక ఊహించని నిజాలు కనిపిస్తే? ఇలాంటి టీనేజ్ డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో వచ్చిన ఇటాలియన్ సిరీస్ ‘Minerva Academy’. నేపుల్స్‌లోని కల్పిత మినర్వా మిలిటరీ హైస్కూల్‌లో కథ సాగుతుంది. ఇక్కడ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, సివిలియన్ దుస్తులు కూడా అనుమతి ఉండదు. తెల్లవారుజామున ఫ్లాగ్ రైజింగ్‌తో రోజు మొదలవుతుంది. మిలిటరీ టాక్టిక్స్, ఫెన్సింగ్ వంటి శిక్షణ కూడా పాఠ్యాంశాల్లో భాగమే. సెప్టెంబర్ 22 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్‌ స్కూల్‌లో దాగిన రహస్యాల చుట్టూ ముందుకు నడుస్తుంది.

కథలోకి వెళ్తే…

సాల్వో అనాథాశ్రమంలో పెరిగిన కుర్రాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విన్సెంజోకు ఏం జరిగిందో తెలుసుకోవాలనే లక్ష్యంతో మినర్వా మిలిటరీ హైస్కూల్‌లో చేరతాడు. అక్కడ అడుగుపెట్టినప్పటి నుంచే కఠినమైన డిసిప్లిన్ అతడికి ఎదురవుతుంది. ప్రతి తప్పుకూ శిక్ష, ప్రతి అడుగుకూ రూల్ ఉండే ఆ స్కూల్‌లో నిజాన్ని వెతకడం అంత సులభం కాదు. అదే సమయంలో సాల్వోకు విన్సెంజో గురించి కొన్ని అనుమానాస్పద ఆధారాలు దొరుకుతాయి. సీనియర్ క్యాడెట్ల మధ్య ఉన్న పోటీ, విద్యార్థుల మధ్య సంబంధాలు, అధికారుల నియమాలు అతడి దర్యాప్తును మరింత క్లిష్టంగా మారుస్తాయి. ఓ దొంగతనం కారణంగా స్కూల్ లాక్‌డౌన్ కావడం, ఫెన్సింగ్ పోటీ, వార్ గేమ్స్ సమయంలో తుపాకీ ఘటన వంటి పరిణామాలు పరిస్థితిని మరింత సీరియస్‌గా మారుస్తాయి. చివరి ఎపిసోడ్లలో విన్సెంజోకు సంబంధించిన ఆధారాలు బయటపడటంతో మినర్వా అకాడమీలో దాగిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఏంటి ? అనే ఇంటెన్స్ తో సాగుతుంది.

Advertisement

ఎక్కడ చూడచ్చు

ఇవాన్ సిల్వెస్ట్రిని దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సిరో మినోపొలి, బియాజియో వెండిట్టి, మార్గెరిటా బున్‌క్రిస్టియాని, బియాట్రిచె సవిగ్నాని, సిమోన్ సెచ్చే, జూలియో బ్రిజ్జి, నికోల్ మలాజ్ తదితరులు నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది ఇటాలియన్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్.Netflixలో ఇటాలియన్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ ఆడియోలు ఉన్నాయి. టీన్ డ్రామాతో పాటు మిస్టరీ, స్కూల్ రహస్యాలు, ఫ్రెండ్ అదృశ్యం, ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఇష్టపడేవారికి ‘Minerva Academy’ ఓ ఇంట్రెస్టింగ్ సిరీస్.

Tags

Related News

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

క్రేజీ పోలీసుల పిచ్చి ప్లాన్‌లు… అడుగడుగునా పొట్టచెక్కలయ్యే కామెడీ

విశ్రాంతి కోసం స్పాకు వెళ్లిన నలుగురు ఫ్రెండ్స్… కట్ చేస్తే ఫుల్ కామెడీ

మాజీ నేవీ సీల్‌కు మళ్లీ డేంజరస్ మిషన్… న్యూక్లియర్ కోడ్స్ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం… హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్

కొండల్లోని అద్భుతమైన మాయా చెట్టు… కలల ప్రపంచంలోకి తీసుకెళ్లే విజువల్ ఫ్యాంటసీ అడ్వెంచర్

నగరాన్ని కాపాడిన సూపర్‌ హీరోనే నిందితుడు… మూడేళ్ల తర్వాత సరదా తీర్చేసిన యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×