Horror Comedy: విపరీతమైన రక్తపాతం, క్రూరమైన హత్యలతో సాగే ఒక పక్కా అడల్ట్ రేటెడ్ హారర్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. హార్రర్ సినిమాల దర్శకుడు ఎలి రోత్ మార్క్‌తో వచ్చిన ఈ సినిమా Ice Cream Man. సాధారణ హారర్ చిత్రాలకు భిన్నంగా, మాయా ఐస్ క్రీమ్ తిని సైకోలుగా మారిన చిన్న పిల్లలే తమ తల్లిదండ్రులను, ఊరి పెద్దలను వేటాడి చంపే వింతైన కాన్సెప్ట్‌ను చూపించారు ఇందులో. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా పచ్చిగా ఉండే నరికివేతలు, భయంకరమైన గోర్ సీన్లు, అక్కడక్కడా నవ్వు తెప్పించే డార్క్ హ్యూమర్‌తో ఈ సినిమా సాగుతుంది. మైండ్ లెస్ బ్లడ్ అండ్ కిల్లింగ్స్ ఇష్టపడే హార్డ్‌కోర్ హారర్ అభిమానులను మాత్రం ఈ మూవీ బెస్ట్ సజెషన్.
ఐస్ ‘క్రీమ్ మ్యాన్’ అనేది ఒక పక్కా బ్లడ్‌బాత్ అండ్ స్లాషర్ హారర్ మూవీ. ఈ కథ బేలీన్ బే అనే ఒక ప్రశాంతమైన టౌన్ నేపథ్యంలో సాగుతుంది. ఒకరోజు అక్కడికి జోనాథన్ స్మైలీ అనే ఒక వింతైన ఐస్ క్రీమ్ వాడు తన ట్రక్కుతో వస్తాడు. అతను ఇచ్చే కలర్‌ఫుల్ ఐస్ క్రీమ్స్ తిన్న చిన్న పిల్లలంతా ఒక్కసారిగా బ్రెయిన్‌వాష్ అయిపోయి, తమ సొంత తల్లిదండ్రులను, ఊరిలోని పెద్దవాళ్లను దారుణంగా చంపేసే క్రూరమైన సైకోలుగా మారిపోతారు. ఆ ఐస్ క్రీమ్ తినని జారెడ్ అనే కుర్రాడు, అతని స్నేహితులు కలిసి ఈ ఊచకోత నుండి తప్పించుకుంటూ, అసలు ఆ ఐస్ క్రీమ్ వాడి వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టాలని చూస్తారు. కథ లోపలికి వెళ్తే, గతంలో ఆ ఐస్ క్రీమ్ మ్యాన్ తప్పు చేయకపోయినా ఊరి పెద్దలు అన్యాయంగా నింద వేసి జైలుకు పంపుతారు. అక్కడ ఒక మాంత్రికుడు అతని ఆత్మను తీసుకుని, ఊరిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ మాయా ఐస్ క్రీమ్ శక్తులను ఇస్తాడు. ఈ శాపాన్ని ముగించాలంటే స్మశానంలో ఉన్న ఆ మాంత్రికుడి శవాన్ని నాశనం చేయాలని ఒక లోకల్ పూజారి ఆ బాల గ్యాంగ్‌కు చెబుతాడు. అయితే క్లైమాక్స్‌లో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ చూసే వాళ్ళందరికీ బుర్ర గిర్రున తిరిగిపోతుంది. మరి ఆ ట్విస్ట్ తో పాటు, ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే ఓటీటీలో ఓ లుక్ వేయండి.
ఎలి రోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆరి మిల్లెన్, బెంజమిన్ బైరన్ డేవిస్, కరెన్ క్లిచ్, సారా అబాట్, షిలో ఓ’రైలీ, కియోరి మిర్జా వాల్డ్‌మన్ తదితరులు నటించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 26 నిమిషాలు. ఇది హార్రర్, డార్క్ కామెడీ జానర్‌లో రూపొందింది. ‘Ice Cream Man’ సెప్టెంబర్ 22 నుంచి Prime Videoలో రెంట్‌కు అందుబాటులోకి వచ్చింది. సాధారణ హార్రర్ కంటే డార్క్, గోరీ కంటెంట్‌తో కూడిన సినిమాలు ఇష్టపడేవారికి ఇది భిన్నమైన అనుభూతిని ఇచ్చే సైకో హార్రర్.
Read Also: రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్