AA22xA6 : కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్న నటులలో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆర్య సినిమాతోనే మంచి గుర్తింపును సాధించుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఎంచుకున్న ప్రతి కథ తనను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు పడిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. పుష్ప సినిమా ఏ స్థాయిలో హీట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కు గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
పుష్పరాజ్ ఇంపాక్ట్
పుష్ప సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా పుష్పరాజు అనే క్యారెక్టర్ ని సుకుమార్ డిజైన్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. పార్ట్ వన్ రిలీజ్ అయిన వెంటనే చాలామంది పుష్పరాజు డైలాగ్స్ ను ఆటిట్యూడ్ ను ఇమిటేట్ చేశారు. చాలామంది పొలిటిషియన్స్, స్పోర్ట్స్ మేన్స్ వీరందరూ ఇమిటేట్ చేయటం వలన పుష్ప సినిమా క్రేజీ మరింత పెరిగింది. పుష్పాకి సీక్వల్ గా వచ్చిన పుష్ప టు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతే తెలిసిందే. అట్లీ తన కెరియర్లో చేస్తున్న ఆర్య సినిమా ఇది. బాలీవుడ్ లో జవాన్ వంటి సక్సెస్ తర్వాత మొదటిసారి తెలుగు హీరోతో భారీ స్థాయిలో సినిమాను చేయనున్నాడు.
అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా మూడు పాత్రలో కనిపిస్తాడు అని సమాచారం వినిపిస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ తన కెరియర్ లో ఇప్పటివరకు కూడా చేయలేదు. మొదటిసారి ఏకంగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అట్లీ సినిమాలలో ఇలాంటి అంశాలు ఉండటం అనేది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా దాదాపు 800 కోట్లు బడ్జెట్ తో నిర్మితమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కథనాలు వినిపించాయి. అలానే అట్లీ దాదాపు 100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
Also Read : Bharat Ane Nenu: రీ రిలీజ్‌కు రెడీ అయిన ‘భరత్ అనే నేను’.. అవసరమా బ్రో అంటున్న ఫ్యాన్స్