OTT Movie : ఎన్నో సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే వీటిలో ఎవర్ గ్రీన్ సినిమాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక తల్లి చివరికోరిక చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. 21వ శతాబ్దపు గొప్ప చలనచిత్రాలలో ఒకటిగా ఈ మూవీని చెప్పుకుంటున్నారు. ఒక అడ్వెంచర్ మూవీల స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
నవల్ మార్వాన్ అనే మహిళకు ఇద్దరు కవల పిల్లలు జీన్,సైమన్ ఉంటారు. ఒకరోజు ఆమె తన చివరి కోరికలను రెండు లెటర్ల మీద రాసి చనిపోతుంది. ఆమె మరణం తర్వాత ఆమె పిల్లలు, ఆమె చివరి కోరికలను నెరవేర్చడానికి తల్లి రాసిన లేఖలను అందుకుంటారు. ఒక లేఖ వీళ్ళ తండ్రికి, రెండవది వీళ్ళ సోదరుడికి సంబంధించినది. అయితే జీన్, సైమన్‌కు తమ తండ్రి గురించి గాని, సోదరుడు గురించి గాని ఏమీ తెలియదు. ఇది జీన్, సైమన్ లకు షాక్ కలిగిస్తుంది. జీన్ ఒక మాథమెటిక్స్ ప్రొఫెసర్ గా ఉంటుంది. ఇప్పుడు జీన్ ఈ లెటర్ లను, తన తల్లి జన్మస్థలమైన మధ్యప్రాచ్య దేశానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆమె తన తల్లి గతాన్ని, ఆమె ఎదుర్కొన్న దుర్ఘటనలను గురించి తెలుసుకుంటుంది. నవల్ యుద్ధ సమయంలో జైలులో ఉండి, హింసను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది.
సైమన్ మొదట్లో ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడు. కానీ చివరికి తన సోదరితో కలిసి అసలు నిజాలు కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. జీన్, సైమన్ తమ తల్లి లేఖలను ఎవరికి ఇవ్వాలో కనిపెడతారు. ఈ క్రమంలో వాళ్ళు తమ కుటుంబ గురించి ఒక దిగ్భ్రాంతికరమైన నిజాన్ని తెలుసుకుంటారు. ఈ ఊహించని మలుపుకు సినిమాను చూసే ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. చివరికి ఈ కవల పిల్లలు తమ కుటుంబం గురించి తెలుసుకున్న రహస్యం ఏంటి ? నవల్ ఆ లెటర్ లలో రాసిన ఆఖరి కోరికలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మనుషుల్ని వేటాడే భారీ సాలీడు… మైండ్ బెండ్ చేసే సై-ఫై మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ కెనడియన్ డ్రామా మూవీ పేరు ‘ఇన్సెండీస్’ (Incendies). 2010 లో వచ్చిన ఒక మూవీకి డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ వాజ్ది మౌవాద్ రాసిన నాటకం ఆధారంగా రూపొందింది. ఇందులో లుబ్నా అజాబల్, మెలిస్సా డెసోర్మెక్స్-పౌలిన్, మాగ్జిమ్ గౌడెట్, రెమీ గిరార్డ్ నటించారు. ఈ సినిమా కెనడాతో పాటు విదేశాలలో కూడా విస్తృతమైన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. 2011లో ఇది ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది. ‘ఇన్సెండీస్’ ఉత్తమ చలన చిత్రంతో సహా ఎనిమిది జెనీ అవార్డులను కూడా గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.