E-Paper
Advertisement

క్లియోపాత్రా నెక్లెస్ దొంగతనం కోసం మాస్టర్ ప్లాన్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హీస్ట్ థ్రిల్లర్

క్లియోపాత్రా నెక్లెస్ దొంగతనం కోసం మాస్టర్ ప్లాన్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హీస్ట్ థ్రిల్లర్
Advertisement

Action Thriller : 2014 జపనీస్ లైవ్ – హీస్ట్ యాక్షన్ సూపర్ హిట్ మూవీ ‘లుపిన్ III’ (Lupin the 3rd). ప్రపంచంలోనే అత్యంత తెలివైన, స్టైలిష్ దొంగ అర్సేన్ లుపిన్ III, అతని బృందం హై-ఆక్టేవ్, స్మార్ట్ హీస్ట్ అడ్వెంచర్ ఇది. ప్రముఖ మాంగా అండ్ యానిమే సిరీస్ ఆధారంగా తీసిన ఈ లైవ్-యాక్షన్ సినిమా యాక్షన్, స్టైల్, హ్యూమర్, భారీ హీస్ట్ సీక్వెన్స్‌లతో, పీక్ సస్పెన్స్, మెంటలెక్కించే ట్విస్టులతో అద్భుతంగా ఉంటుంది. ర్యుహీ కితామురా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షున్ ఒగురి లుపిన్ III పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు. మరి ఈ మూవీ కథేంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

అర్సేన్ లుపిన్ III (షున్ ఒగురి) ప్రపంచంలోనే తెలివైన దొంగ. అతను ‘ది వర్క్స్’ అనే అంతర్జాతీయ దొంగల సంస్థలో సభ్యుడు. ఈ సంస్థను లుపిన్ గురువు థామస్ డాసన్ నడుపుతుంటాడు. సింగపూర్‌ లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ దొంగతనంలో లుపిన్ ఒక ఒలింపిక్ పతకాన్ని విజయవంతంగా దొంగిలిస్తాడు. కానీ అతని పాత మిత్రుడు ప్రస్తుత ప్రత్యర్థి మైఖేల్ లీ (జెర్రీ యాన్) ఆ నిధిని లుపిన్ నుంచి బలవంతంగా లాక్కుంటాడు. ఇది లుపిన్‌కు పెద్ద షాక్.

Advertisement

ఇదే సమయంలో థామస్ డాసన్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత విలువైన ‘క్రిమ్సన్ హార్ట్ ఆఫ్ క్లియోపాత్రా’ అనే అమూల్యమైన హారం ఉంటుంది. ఆ హారం మధ్యలో ఉండాల్సిన అరుదైన రూబీ మాత్రం ఆసియా అండర్‌వరల్డ్ డాన్ ప్రముక్ ఆధీనంలో ఉంటుంది. హారంతో పాటు రూబీ రెండూ కలిస్తేనే ఆ నిధికి పూర్తి విలువ లభిస్తుంది. మైఖేల్ లీ మరో వ్యక్తితో కలిసి థామస్ డాసన్‌ పై దాడి చేసి అతనిని చంపేస్తారు. ఆ హారాన్ని కూడా దొంగిలిస్తారు. ఈ ఘటనతో ‘ది వర్క్స్’ కూటమి పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. తన గురువు మరణానికి పగ తీర్చుకోవాలని, దొంగిలించబడిన హారాన్ని తిరిగి సంపాదించాలని లుపిన్ నిర్ణయించుకుంటాడు.

అందుకోసం అతను అపజయం అన్నదే ఎరుగని టీంను తయారు చేస్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ గన్‌మ్యాన్ డైసుకే జిగెన్, ఏ వస్తువునైనా ఒక్క కత్తి కొట్టుతో నరికేసే సమురాయ్ గోఎమోన్ ఇషికావా XIII, తెలివైన, మనసు మార్చే లేడీ థీఫ్ ఫుజికో మైన్ ఈ టీంలో భాగం అవుతారు. ఈ బృందాన్ని అంతం చేయడానికి ఇంటర్‌పోల్ ఇన్‌స్పెక్టర్ కోయిచి జెనిగాటా వారిని అవిరామంగా వెంటాడుతూనే ఉంటాడు. మైఖేల్ లీ ద్వారా హారాన్ని కూడా దక్కించుకున్న లీ టీంమేట్, ఆ నిధిని థాయ్‌లాండ్ అడవుల్లో ఉన్న అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సెక్యూరిటీ గల ‘ఆర్క్ ఆఫ్ నవరోన్’ అనే కోటలాంటి సేఫ్‌హౌస్‌లో దాచేస్తాడు. మరి లుపిన్ భద్రతా వలయాలను ఛేదించి ఆ కోటలోకి ఎలా చొరబడతారు ? ఈ క్రమంలో బయట పడ్డ షాకింగ్ నిజం ఏంటి ? చివరికి హీరో విలన్ ను చంపి పగ ఎలా తీర్చుకుంటాడు ? ఆ అమూల్యమైన క్లియోపాత్రా హారాన్ని హీరో ఎలా తెచ్చాడు ? అన్నది తెరపై చూడాల్సిందే. ‘లుపిన్ III’ని ప్రస్తుతం Netflixలో వీక్షించవచ్చు.

Advertisement

Read Also : వీళ్ళు పిల్లలు కాదు బాబోయ్ పిశాచాలు… కమ్యూనిటీలోకి వెళ్ళే బేబీసిట్టర్లు మాయం

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×