Jee 5Head Anuradha: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాను పోలిన కథ నేపథ్యంలో మరొక సినిమాలు రావడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎవరైతే తమ సినిమాని కాపీ కొట్టారో వారు కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఇలా సినిమాలు మాత్రమే ఒకే కథతో వచ్చి వివాదాన్ని సృష్టించాయి కానీ ఇప్పుడు ఏకంగా సిరీస్ లు కూడా ఒకే కథతో ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున వివాదంగా ఏర్పడింది. ఇటీవల పోలూరి కృష్ణ దర్శకత్వం వహించిన “విరాటపాలెం”(Viratapalem) అనే సిరీస్ జూన్ 27వ తేదీ జీ 5 లో ప్రసారమైంది. ఈ సిరీస్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
పెళ్లి కూతుర్ల మరణాలు..
1980లలో .. ఒక మారుమూల గ్రామంలో ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి యువతులు పెళ్లికూతురుగా ఉండగానే మరణించడం జరుగుతుంది. ఇలా పెళ్లికూతురులు ఎందుకు మరణిస్తున్నారనేది అర్థం కాని విషయం బహుశా అది ఆ గ్రామానికి శాపం కావచ్చు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామానికి ఒక లేడీ కానిస్టేబుల్ వస్తుంది ఆ తర్వాత కథ ఏం జరిగింది ఆ మరణాలకు కారణం ఏంటనేది ఈ సిరీస్ కథ. ఇక ఈ సిరీస్ జీ5 లో ప్రసారమవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇది మా కథ అంటూ ఈటీవీ విన్ కోర్టును ఆశ్రయించారు.
వర్ష బొల్లమ్మ…
దర్శకుడు ప్రశాంత్ కుమార్(Prashanth Kumar) దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన “కానిస్టేబుల్ కనకం” (Constable Kanakam)త్వరలోనే ప్రసారమవుతుంది. మా కథతోనే విరాటపాలెం సిరీస్ చేశారు అంటూ ఆరోపణలు చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ ఓ సమస్థకు గతంలో ఈ కథ చెప్పారని అయితే వాళ్లు రిజెక్ట్ చేయడంతో ఈటీవీ విన్ వారి నేతృత్వంలో ఈ కానిస్టేబుల్ కనకం చేయబోతున్నానని తెలిపారు. అంతలోపే వారు మా కథతో సిరీస్ చేసే విడుదల చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా కోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్ లో వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు సిరీస్ ల మధ్య పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.
మాది ఒరిజినల్…
డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, ఈటీవీ విన్ అధినేత సాయి కృష్ణ మీడియా సమావేశంలో విరాట పాలెం సిరీస్, జీ 5 పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక ఇందుకు అనుగుణంగానే జీ 5 హెడ్ అనురాధ(Anuradha) కూడా తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే మా సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది అయితే వారు మా సిరీస్ చూడకుండానే వెంటనే కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి వచ్చి సరాసరి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారని కనీసం అక్కడ ఏముంది ఏంటి అనేది కూడా తెలియకుండా మాట్లాడాలని తెలిపారు. ఇలా ప్రెస్ మీట్ అయిన తర్వాత తిరిగి ఈ సిరీస్ చూశారని చూసిన తర్వాత వాళ్లు సైలెంట్ అయ్యారు అంటూ అనురాధ తెలిపారు. ఇలా సిరీస్ చూడకుండానే విమర్శలు చేయడం సరికాదు అంటూ తనదైన శైలిలోనే కానిస్టేబుల్ కనకం డైరెక్టర్, ఈటీవీ విన్ హెడ్ సాయి కృష్ణకు కౌంటర్ ఇచ్చారు. మేము ఎవరి కథను కాపీ కొట్టలేదని మాది 100% నిజమైన కథ అంటూ ఈమె తెలియజేశారు. మరి ఈమె వ్యాఖ్యలపై కానిస్టేబుల్ కనకం టీం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: కత్తి కూడా కాపీ కొట్టడం ఏంటయ్యా విష్ణు… అడ్డంగా దొరికిపోయాడుగా?