BigTV English

Manchu Vishnu: కత్తి కూడా కాపీ కొట్టడం ఏంటయ్యా విష్ణు… అడ్డంగా దొరికిపోయాడుగా?

Manchu Vishnu: కత్తి కూడా కాపీ కొట్టడం ఏంటయ్యా విష్ణు… అడ్డంగా దొరికిపోయాడుగా?

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా(Kannappa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమాలో ప్రతి సన్నివేశానికి క్షుణ్ణంగా పరిశీలించిన కొంతమంది నెటిజన్స్ ప్రతి సన్నివేశాన్ని కూడా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఇతర సినిమాల నుంచి కూడా కాపీ చేశారు అంటూ గత కొద్దిరోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సమయంలో హీరోయిన్ ని కలిసే సన్నివేశాలు అన్నీ కూడా అచ్చం బాహుబలి (Bahubali)సినిమాలో ప్రభాస్ తమన్నా మధ్య జరిగే సన్నివేశాలను పోలివున్న నేపథ్యంలో విష్ణు పై కాఫీ క్యాట్ అంటూ విమర్శలు కురిపించారు.


బోయపాటి స్కంద..

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రసారమవుతున్న నేపథ్యంలో సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా ఇతర సినిమాలను పోలి ఉన్నాయి అంటూ మంచు విష్ణు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఒక యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సీన్లు విష్ణు ఒక కత్తిని రెండుగా విడదీసి చూపిస్తారు అయితే ఆ కత్తి ఆకారం, ఆ కత్తిని చూపించే విధానం మొత్తం బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన స్కంద (Skanda) సినిమాలో ఒక యాక్షన్ సన్నివేషాన్ని పోలి ఉంది.


ఆయుధాలు కూడా కాపీనేనా…

ఇలా స్కంద సినిమాని స్ఫూర్తిగా తీసుకొని విష్ణు కన్నప్ప సినిమాలో ఇలాంటి ఒక ఆయుధాన్ని తయారు చేశారా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు మరోసారి విష్ణు పై కాపీ విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇతర సినిమాల నుంచి దాదాపు సగం సన్నివేశాలను కాపీ కొట్టడంతో పెద్ద ఎత్తున నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఏదో ఒక సీన్ కాపీ కొట్టినా అర్థముంది కానీ చివరికి కత్తి కూడా కాపీ కొట్టడం ఏంటి విష్ణు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా నుంచి, స్కంద సినిమా నుంచి అదే తరహా ఆయుధాలను కన్నప్ప సినిమాలో పెట్టడంతో విష్ణువుని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

https://www.youtube.com/shorts/WQG8EHFHjkY?feature=share

ఒకప్పుడు ఇలా ఒక సినిమాని స్ఫూర్తిగా తీసుకొని మరొక సినిమాలో చేసిన పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఏ చిన్న తప్పు చేసిన క్షణాల్లో దొరికిపోతున్నారు. ఇలా డిజిటల్ యుగంలో బ్రతుకుతూ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు విష్ణు అంటూ విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన సినిమాతో పరలేదని అనిపించుకున్నారు. ఇటీవల కాలంలో మంచి విష్ణు నటించిన సినిమాలు దాదాపు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచడమే కాకుండా సినిమాల కారణంగా విష్ణు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు కానీ కన్నప్ప సినిమాతో నటనపరంగా విమర్శలను ఎదుర్కోకపోయినా ఇలా కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాలను పోలి ఉన్న నేపథ్యంలో విమర్శలు ఫాలో అవుతున్నారు.

Also Read: మంచు మావయ్యా.. ‘కన్నప్ప’ సినిమాకు చూస్తానంటూ చిన్నారి పేచీ, విష్ణు స్పందన ఇదే

Related News

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Tollywood: శశివదనే ప్రెస్ మీట్.. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా మూవీ చూడాల్సిందే!

Kalki 2: నాగ్ అశ్విన్ మూవీలో సాయి పల్లవి.. కల్కి 2లోనా? వేరే మూవీనా? ఇదిగో క్లారిటీ

Rahul Ramakrishna: ట్రోల్స్ ఎఫెక్ట్… ప్రజా సేవలోకి దిగిన రాహుల్ రామకృష్ణ

Hrithik Roshan: వార్ 2 సినిమాపై ఓపెన్ అయిన హృతిక్.. గాయంలా ఉండాల్సిన పనిలేదంటూ!

Big Stories

×