OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ లతో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక దీవి చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడే ఇద్దరు పిల్లలు అందులో చిక్కుకుపోతారు. ఆతరువాత స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
1897 సంవత్సరంలో సారా హార్గ్రేవ్ అనే మహిళ తన కుమార్తె లిల్లీ, ఆమె దత్తపుత్రుడు రిచర్డ్ తో కలసి ఒక ఓడలో ప్రయాణిస్తుంటారు. ఓడలో కలరా వ్యాధి వ్యాపించడంతో, సారా, లిల్లీ, రిచర్డ్ ఒక చిన్న పడవలో బయటకు వస్తారు. ఆతరువాత వీళ్ళు ఒక అందమైన దీవిలో చిక్కుకుంటారు. అక్కడ సారా లిల్లీ, రిచర్డ్‌లను నాగరికంగా పెంచడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె అనుకోకుండా ఒకరోజు మరణిస్తుంది. లిల్లీ, రిచర్డ్‌లు తమంతట తాము జీవించాల్సి వస్తుంది. వారు ద్వీపంలోని ఒక చిన్న ఇంటిని ఉపయోగించుకుంటూ, చేపలు పట్టడం, ఈత కొట్టడం, ద్వీపాన్ని పరిశీలించడం వంటి పనులు చేస్తుంటారు. సంవత్సరాలు గడిచేకొద్దీ, లిల్లీ, రిచర్డ్ యుక్తవయస్సులోకి అడుగుపెడతారు. వారి శరీరాల్లో మార్పులు కూడా వస్తాయి.ఆ తరువాత కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కుంటారు.
ఒక రోజు రాత్రి రిచర్డ్ ద్వీపంలో కొంతదూరం వెళతాడు. అయితే అక్కడ కొంత మంది అనాగరికులు కనిపిస్తారు. వాళ్ళు బలి ఇచ్చే ఆచారాన్ని చూస్తాడు. కానీ రిచర్డ్ భయపడి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతలో ఒక ఓడ ఈ ద్వీపానికి చేరుకుంటుంది. దానిలోని సిబ్బంది లిల్లీ, రిచర్డ్‌లను నాగరిక ప్రపంచంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. అయితే సిబ్బందిలోని ఒక సభ్యుడు, లిల్లీపై మనసులో చెడుగా ఊహించుకుంటాడు. ఆమెపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తాడు. రిచర్డ్ అతనితో పోరాడి ఆమెను కాపాడతాడు. ఆ తరువాత వాళ్ళు అక్కడినుంచి వెళ్లిపోతారు. చివరికి రిచర్డ్, లిల్లీ ఆ దీవిలోనే ఉండిపోతారా ? నాగరిక ప్రపంచంలో అడుగు పెట్టరా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ అడ్వెంచర్ సినిమాను చూడండి.
ReadAlso : లేకలేక పిల్ల దొరికితే మంత్రగత్తె అంటూ… బాయ్ ఫ్రెండ్ చేసే పనికి ఫ్యూజులు అవుట్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ అడ్వెంచర్ సినిమా పేరు ‘రిటర్న్ టు ది బ్లూ లగూన్’ (Return to the Blue Lagoon). 1980 లో వచ్చిన ‘The Blue Lagoon’ సినిమాకి సీక్వెల్‌గా వచ్చింది. దీనికి విలియం ఎ. గ్రాహం దర్శకత్వం వహించారు. ఇందులో మిల్లా జోవోవిచ్, బ్రియాన్ క్రాస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా హెన్రీ డి వెరే స్టాక్‌పూల్ రాసిన ‘The Garden of God’ నవల ఆధారంగా రూపొందింది. ఈ స్టోరీ ఇద్దరు ఒక ద్వీపంలో చిక్కుకోవడంతో మొదలౌతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.