Horror Movie OTT : ప్రతి 23 ఏళ్లకు ఒక్కసారి బయటకు వచ్చే ఓ భయంకరమైన జీవి… వరుసగా 23 రోజుల పాటు మనుషులను వేటాడి తింటుంది. ఆ కథను నమ్మి హారర్ ఫెస్టివల్ కు వెళ్లిన ఓ యువ జంటకు, అక్కడే ఆ జీవి నిజంగా మేల్కొన్న విషయం తెలుస్తుంది. సరదాగా మొదలైన ట్రిప్ కాస్తా ప్రాణాల కోసం పరుగెత్తే పరిస్థితిగా మారుతుంది. వింత శక్తులు, భయంకరమైన వేట, రహస్యమైన కల్ట్ తో సాగే హారర్ మూవీ ‘జీపర్స్ క్రీపర్స్ రీబార్న్’ (Jeepers Creepers: Reborn). మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం.
2021లో చేజ్, లైన్ అనే యువ జంట లూసియానాలోని గ్రామీణ ప్రాంతానికి బయలుదేరుతుంది. అక్కడ జరిగే హారర్ హౌండ్ ఫెస్టివల్ కు వెళ్లడం అంటే చేజ్ కు చాలా ఆసక్తి. అతను పారానార్మల్ విషయాలపై మక్కువ ఉన్న వ్యక్తి. అదే ట్రిప్ లో లైన్ కు పెళ్లి ప్రపోజ్ చేయాలని కూడా అతను ప్లాన్ చేస్తాడు. అయితే లైన్ కు కూడా ఓ విషయం దాచిపెడుతుంది. ఆమె గర్భవతి అయి ఉండొచ్చనే అనుమానంతో ఉంటుంది. ఇదే సమయంలో స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న ఓ భయంకరమైన కథ గురించి చేజ్ ఆసక్తి చూపిస్తాడు. ప్రతి 23 ఏళ్లకు ఒకసారి క్రీపర్ అనే రాక్షస జీవి మేల్కొంటుంది. 23 రోజుల పాటు వేటాడి, మనుషులను చంపి తిని, మళ్లీ అదృశ్యమవుతుంది అనేదే ఆ కథ.
ఫెస్టివల్ కు వెళ్తున్న సమయంలో లైన్ ఓ వింత వస్తువును తాకుతుంది. వెంటనే ఆమెకు భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలపై భయంకరమైన సంఘటనలు కనిపిస్తాయి. తర్వాత ఫెస్టివల్ లో మరో వస్తువు ఆమె చేతికి దొరుకుతుంది. దాన్ని పట్టుకున్న తర్వాత ఆమెకు ఒక కొత్త శక్తి వస్తుంది. అప్పటికే క్రీపర్ మేల్కొంటుంది. ఫెస్టివల్ లో ఉన్నవాళ్లను వేటాడటం మొదలు పెడుతుంది. పరిస్థితిని మరింత భయంకరంగా మార్చేందుకు దాని వాహనం కూడా కీలకంగా మారుతుంది. ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసి ప్రజలను బయట ప్రపంచం నుంచి వేరు చేస్తుంది.
చేజ్, లైన్ ఒక రాఫిల్ ద్వారా ఓ పాత ప్లాంటేషన్ హౌస్ లో జరిగే ఎస్కేప్ రూమ్ ఈవెంట్ లో పాల్గొంటారు. కానీ ఆ ఇల్లు మామూలుది కాదు. లైన్ కు అక్కడ జరిగే రహస్యమైన ఆచారాల గురించి ముందుగానే తెలుస్తుంది. క్రీపర్ అక్కడికి చేరుకోవడంతో ఫెస్టివల్ సరదా మొత్తం రక్తపాతంగా మారుతుంది. క్రీపర్ ఎందుకు లైన్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది ? ఆ ఇంట్లోని వ్యక్తులకు దానితో ఎలాంటి సంబంధం ఉంది ? లైన్ తనకు కనిపిస్తున్న ఫ్యూచర్ విజన్స్ తో చేజ్‌ను, తనను తాను కాపాడుకోగలదా ? క్రీపర్ మళ్లీ చావును దాటి తిరిగి వస్తుందా ? అనేది తెలియాలంటే ‘జీపర్స్ క్రీపర్స్ రీబార్న్’ను డోంట్ మిస్.
Also Read : భూమిని తుడిచిపెట్టే వైరస్… 2035 నుంచి పాస్ట్‌లోకి వెళ్లిన ఖైదీ… అల్టిమేట్ టైమ్ ట్రావెల్ సై-ఫై సిరీస్
‘జీపర్స్ క్రీపర్స్ రీబార్న్’ 2022లో వచ్చిన హారర్ మూవీ. సిడ్నీ క్రావెన్, ఇమ్రాన్ ఆడమ్స్, జారో బెన్సన్ తదితరులు నటించారు. Amazon Prime Videoలో Vrott ద్వారా, అలాగే JioTVలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. కాకపోతే తెలుగు ఆడియో మాత్రం లేదు.