BigTV English

OTT Movie : కూతురు కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చే తండ్రి … మతి పోగొట్టే ఇన్వెస్టిగేషన్ తో మెంటలెక్కించే సినిమా …

OTT Movie : కూతురు కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ ఇచ్చే తండ్రి … మతి పోగొట్టే ఇన్వెస్టిగేషన్ తో మెంటలెక్కించే సినిమా …

OTT Movie : ఈమధ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అన్ని భాషలలో వస్తున్న ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ మూవీలో కూతుర్ని కిడ్నాప్ చేసిన క్రిమినల్ ని పట్టుకోవడానికి ఓ తండ్రి నడుంబిగిస్తాడు. ఆ తర్వాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

పెన్సిల్వేనియాలోని ఒక చిన్న పట్టణంలో కెల్లర్ డోవర్ అనే వ్యక్తి అతని భార్య గ్రేస్, కూతురు అన్నాతో కలసి ఉంటాడు. ఒకరోజు వీళ్ళ స్నేహితులైన ఫ్రాంక్లిన్, నాన్సీ బిర్చ్ కుటుంబంతో కలిసి థాంక్స్‌గివింగ్ సెలవు దినాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంలో డోవర్, బిర్చ్ కుటుంబాల కూతుళ్లు అన్నా, జాయ్ ఆడుకోవడానికి బయటకు వెళతారు. ఎంతసేపైనా బయటికి పోయిన వాళ్ళు తిరిగి రాకపోవడంతో ఇరు కుటుంబాలు ఆందోళన చెందుతారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారు. డిటెక్టివ్ లోకి ఈ కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ లో ఒక వెహికల్ అనుమానస్పదంగా కనిపిస్తుంది. దానిని అలెక్స్ జోన్స్ అనే మానసిక స్థితి సరిగా లేని యువకుడు నడుపుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులు అలెక్స్‌ను అరెస్ట్ చేస్తారు. కానీ ఆధారాలు లేకపోవడంతో అతన్ని మళ్ళీ విడుదల చేస్తారు.


ఇక పోలీసులు కేసును తేలిగ్గా తీసుకోవడంతో, కెల్లర్ డోవర్ తన కూతురు కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. అలెక్స్‌ను కిడ్నాప్ చేసి, అతన్ని హింసించి నిజాలు తెలుసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అదే సమయంలో డిటెక్టివ్ లోకి కేసును లోతుగా దర్యాప్తు చేసి, దిమ్మతిరిగే విషయాలను వెలుగులోకి తెస్తాడు. చివరికి అలెక్స్ నిజంగా నేరస్థుడా ? మరెవరైనా ఈ కిడ్నాప్ వెనుక ఉన్నారా ? డిటెక్టివ్ లోకి వెలుగులోకి తెచ్చే నిజాలు ఏంటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : కండక్టర్ జాబ్ కలిపే లవ్ స్టోరీ … కొత్త ప్రేమకు పాత కండీషన్… తెలుగులోనూ స్ట్రీమింగ్

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రిజనర్స్’ (Prisoners). 2013 లో వచ్చిన ఈ సినిమాకు డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించారు. ఇందులో హ్యూ జాక్‌మన్, జేక్ గిల్లెన్‌హాల్, వియోలా డేవిస్, బెల్లో, టెరెన్స్ హోవార్డ్, మెలిస్సా లియో వంటి నటులు నటించారు. ఈ సినిమా పెన్సిల్వేనియాలో ఇద్దరు యువతులను ఒక కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో రన్ అవుతుంది. ఈ సినిమా థియేటర్లలో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇది నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూచే 2013 టాప్ టెన్ చిత్రాలలో ఒకటిగా ఎంపిక చేయబడింది. 86వ అకాడమీ అవార్డ్స్‌లో రోజర్ డీకిన్స్ ఈ సినిమాకి గానూ ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఎంపికయ్యాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×