E-Paper
Advertisement

OTT Movie : లేచిపోయే ప్రేమ జంటకు వాచిపోయే పెళ్లి … ఇదేం అరాచకంరా సామీ

OTT Movie : లేచిపోయే ప్రేమ జంటకు వాచిపోయే పెళ్లి …  ఇదేం అరాచకంరా సామీ
Advertisement

OTT Movie : లవ్ స్టోరీ లు లేకుండా సినిమా తీయడంఇప్పుడు కష్టమే. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లో ఏదో ఒక లవ్ స్టోరీ ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ, మొత్తం లవ్ స్టోరీ చుట్టే తిరుగుతుంది. ఇందులో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాక ఒక జంట పడే ఇబ్బందులు, సమాజంలో ఎదుర్కొనే ఆటుపోట్లతో ఈ స్టోరీ ఆసక్తికరంగా సాగిపోతుంది. అటు ప్రేమ, ఇటు తల్లిదండ్రులతో నలిగిపోయే ఈ జంట చుట్టూ స్టోరీ తిరుగుతుంది.  ఈ మూవీపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

సోనీ లివ్ (SonyLIV) లో

Advertisement

ఈ మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘జర్నీ ఆఫ్ లవ్ 18+’ (Journey Of Love 18+). ఈ మూవీకి అరుణ్ డి. జోస్ దర్శకత్వం వహించారు. నస్లెన్ కె. గఫూర్, మీనాక్షి, మాథ్యూ థామస్, నిఖిలా విమల్, బిను పప్పు ఇందులో నటించారు. ఈ సినిమా 2023 జులై 7న థియేటర్లలో విడుదలైంది.   సెప్టెంబర్ 15 నుండి (SonyLIV) లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు సహా ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కేరళలోని ఒక గ్రామీణ ప్రాంతం నేపధ్యం లో జరుగుతుంది. ఇద్దరు ప్రేమికులు, అఖిల్, అతిర చుట్టూ కథ తిరుగుతుంది. వీరి లవ్ స్టోరీ వారి కుటుంబాల పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే ఈ స్టోరీ .

స్టోరీలోకి వెళితే

Advertisement

అఖిల్ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త గా ఉంటాడు.  ఆ పార్టీ లోకల్ సెక్రటరీ రవీంద్రన్ కు అతిర అనే కుమార్తె ఉంటుంది. అఖిల్, అతిర ఇద్దరూ  ప్రేమలో పడతారు. కానీ అతిర తండ్రి వీళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తాడు. ఒక రోజు అతిర, అఖిల్‌తో పారిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ విషయం అఖిల్ కు చెప్తుంది అతిర. అఖిల్ తన స్నేహితులు రెంజు, పట్టర్‌తో కలిసి ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తాడు. వారు గతంలో పారిపోయి పెళ్లి చేసుకున్న రాజేష్ అనే వ్యక్తి సహాయం కూడా తీసుకుంటారు. ఆ తరువాత ప్లాన్ ప్రకారం అఖిల్, అతిర తలిపరంబలోని ఒక ఆలయంలో వివాహం చేసుకుంటారు. అయితే వారి పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు వారి వివాహ జీవితాన్ని అయోమయంలో పడేస్తాయి.

అతిర ఇంట్లో ఒక  దురదృష్ట సంఘటన జరుగుతుంది. ఆమె అమ్మమ్మ చనిపోతుంది. ఆ తర్వాత ఈ జంట అతిర ఇంటికి వెళతారు. అక్కడ రవీంద్రన్ అఖిల్‌ను చూసి కోపంతో కొడతాడు. రాజేష్ సహాయంతో వారు మళ్లీ అక్కడినుంచి పారిపోతారు. అతిర కుటుంబం ఒక మిస్సింగ్ కేసు ఫైల్ చేయడంతో, పోలీసులు వారిని కోర్టులో హాజరుపరుస్తారు. ఈ జంట వివాహం జరిగినట్లు ఆధారాలు సమర్పించినప్పటికీ, అతిర ఇంకా 18 ఏళ్లు నిండలేదని ఆమె SSLC సర్టిఫికేట్ ద్వారా రవీంద్రన్ నిరూపిస్తాడు. చివరికి వీళ్ళ పెళ్లికి కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుంది ? వీళ్ళ పెళ్ళిని పెద్దలు అంగీకరిస్తారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడండి.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×