BigTV English

OTT Movie : భార్యను వదిలి ట్రాన్స్ జెండర్ ను తగులుకున్నాడు… మస్తు స్టోరీ ఉంది భయ్యా ఈ సిన్మాలో

OTT Movie : భార్యను వదిలి ట్రాన్స్ జెండర్ ను తగులుకున్నాడు… మస్తు స్టోరీ ఉంది భయ్యా ఈ సిన్మాలో

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో తమకు నచ్చిన సినిమాలను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. భాషతో సంబంధం లేకుండా, స్టోరీ బాగుంటే ప్రతి సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ఫ్యామిలీ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

2022లో విడుదలైన ఈ పాకిస్థానీ మూవీ పేరు ‘జాయ్‌ల్యాండ్’ (Joyland). సైమ్ సాదిక్ తన తొలి సారిగా ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇందులో అలీ జునేజో, రస్తీ ఫరూక్, అలీనా ఖాన్, సర్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా నటించారు. జాయ్‌ల్యాండ్ తక్కువ ఆదాయం కలిగిన రానా కుటుంబం చుట్టూ తిరుగుతుడి. హైదర్‌కి ఎరోటిక్ డ్యాన్స్ థియేటర్‌లో పని దొరికిన తర్వాత భార్య ముంతాజ్‌ని ఉద్యోగం మానేయమని బలవంతం చేస్తాడు. అయితే హైదర్ ఒక హిజ్రా డాన్సర్ అయిన బీబాతో ప్రేమలో పడినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. ‘జాయ్‌ల్యాండ్’ 23 మే 2022న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  ప్రీమియర్‌ను ప్రదర్శించింది, ఈ ఫెస్టివల్‌లో ప్రీమియర్ ప్రదర్శించిన మొదటి పాకిస్థానీ చిత్రంగా నిలిచింది. ఇది జ్యూరీ ప్రైజ్‌ని, అలాగే ఉత్తమ LGBTQ నేపథ్య చిత్రంగా క్వీర్ పామ్‌ని గెలుచుకుంది. ఈ మూవీ మొదట పాకిస్తాన్‌లో థియేట్రికల్ విడుదలకు నిషేధించబడింది. అయితే చిన్న మార్పులు చేసిన తర్వాత విడుదల చేయడానికి ఆమోదించబడింది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సలీం, హైదర్ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. సలీం భార్య డెలివరీ కోసం హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ ఆమె ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. ఇంతలోనే హైదర్ బీబా అనే ఒక ట్రాన్స్ జెండర్ ని చూస్తాడు. తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమెతో హైదర్ ప్రేమలో పడిపోతాడు. నిజానికి హైదర్ కి కూడా ముంతాజ్ తో పెళ్లి జరిగి ఉంటుంది. అయితే ముంతాజ్ జాబ్ చేస్తూ ఉండగా, హైదర్ ఇంట్లోనే ఉంటూ అందరికీ చులకన అవుతాడు. అతనికి ఏమీ చేతకాదని పేరు తెచ్చుకుంటాడు. ఉన్నట్టుండి అతనికి ఒక ఉద్యోగం వస్తుంది. అదేమంటే థియేటర్లో డాన్స్ వేసే ఉద్యోగం. ఈ విషయాన్ని ఇంట్లో మరోలా చెప్పి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళు కూడా మేనేజర్ జాబ్ అనుకొని సంతోషిస్తారు. ముంతాజ్ ని జాబ్ మానిపించి ఇంట్లోనే ఉండమని కుటుంబ సభ్యులు చెప్తారు. ఆమెకు ఇష్టం లేకపోయినా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటుంది.

మరోవైపు హైదర్ బీబాతో బిజీ అయిపోతాడు. భార్యను సరిగా పట్టించుకోవడం మానేస్తాడు. చివరికి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా సంతోషం వ్యక్తం చేయడు. పూర్తిగా బీబా మత్తులో మునిగిపోతాడు. ముంతాజ్ కి భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంటుంది. తనకి జీవితం మీద బాగా విరక్తి పుడుతుంది. మొదట అబార్షన్ చేసుకుందామనుకుంటుంది. ఆ తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఈ విషయం తెలిసి హైదర్ చాలా బాధపడతాడు. చివరికి హైదర్, బీబాల లవ్ స్టోరీ ఏమవుతుంది. హైదర్ తన జీవితాన్ని ఎటు తీసుకెళ్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Related News

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

OTT Movie : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ

OTT Movie : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×