BigTV English
Advertisement

Farmers Used AI: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్య నాదెళ్ల వీడియో రిలీజ్

Farmers Used AI: ఏఐ వినియోగం.. భారతీయ రైతుల అద్భుతాలు, సత్య నాదెళ్ల వీడియో రిలీజ్

Farmers Used AI: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎక్కడ చూసినా.. వినబడినా ఇదే పదం. దీనివల్ల ఉద్యోగాలు పోతాయని కొందరు భయపడుతున్నారు. అద్భుతాలు సృష్టించవచ్చని మరికొందరంటున్నారు. ఏఐ టెక్నాలజీని భారతీయ రైతులు వినియోగించుకోవడంతో నిమగ్నమయ్యారు. దీనివల్ల పంట దిగుబడిని పెంచుకోవడంలో సానుకూల ఫలితాలు వచ్చాయి. దీనికి సంబంధించిన డీటేల్స్‌ను బయటపెట్టారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల.


టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. స్మార్ట్ ఫోన్ ద్వారా అరచేతిలో విశ్వ విజ్ఞానాన్ని చూస్తున్నాము. ఈ టెక్ యుగానికి అనుకూలంగా అడుగులు వేయకుంటే వెనుకబడిపోయినట్టే. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలు ఇప్పుడు ఏఐపై ఫోకస్ చేశాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయి కూడా.

అసలు ఏం జరిగింది?


21వ శతాబ్దపు సాంకేతిక అద్భుతం ఐఏ. విద్య, వైద్యం, వ్యవసాయం, తయారీ ఇలా ఏ రంగాలు చూసినా మంచి ఫలితాలు రాబట్టవచ్చు. భారతీయ రైతులు రైతులు ఏఐ ను ఉపయోగించుకొని వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్నారు. తమ పంట దిగుబడిని పెంచుకోవడంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో ఏఐ అద్భుతమైన ప్రభావం చూపుతోందని చెప్పేందుకు ఇదొక అద్భుతమైనదిగా రాసుకొచ్చారాయన.

మైక్రోసాఫ్ట్ ప్రయోగాలు

మహారాష్ట్రలోని బారామతి రైతులు ఐఏ ద్వారా వారు తమ పంటల దిగుబడిని పెంచుకున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ వెల్లడించారు. డ్రోన్లు, ఉప గ్రహాల నుంచి పొందిన జియోస్పేషియల్ డేటాను వినియోగించుకున్నారు. రైతులకు తమ భూముల పరిస్థితి గురించి తెలుసుకోవడం వల్ల మరింత మేలు జరిగిందన్నారు. రైతులకు అర్థమయ్యే విధంగా ఉండటంతో మరింత సులువుగా పనులు చేసుకోవచ్చని వివరించారు.

ALSO READ: టపాసుల గోడౌన్ లో భారీ పేలుడు

బారామతిలో గడిచిన రెండేళ్లుగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వ్యవసాయాలపై ప్రయోగాలు చేపట్టింది. అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌-ADT సాయంతో బారామతిలో ఈ ప్రయోగాలు చేసింది. బారామతి సహకార సంఘంలో వున్న రైతులకు ఏఐ పై అవగాహన కల్పించామని వివరించారు మైక్రోసాఫ్ట్ సీఈఓ.

డ్రోన్లు, శాటిలైట్లు, వాతావరణ కేంద్రాలు, సాయిల్ సెన్సర్లు ద్వారా సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా రైతులకు భూముల కోసం సమగ్రంగా అవగాహన కల్పించారు. తమ సేద్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నా రు. మంచి ఫలితాలు వచ్చాయని సత్య నాదెళ్ల వివరించారు.

స్థానిక భాషలో సమాచారం

నేలలో తేమ, ఉష్ణోగ్రతలు, పోషక స్థాయిలు అన్ని రకాల వివరాలను ఏఐ అనే మొబైల్‌ యాప్‌ ద్వారా రైతులకు అందించారు. ఈ సమాచారమంతా స్థానిక భాషలో ఉండడంతో అర్థం చేసుకోవడం రైతులకు మరింత ఈజీ అయ్యింది. ఏఐ లాగరిథమ్స్‌ డేటాను విశ్లేషించి విత్తనాలు ఎప్పుడు నాటాలి? నీరు ఎంత ఇవ్వాలి? తెగుళ్ల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలు రియల్‌ టైమ్‌లో విశ్లేషించి రైతులకు తెలియజేసింది మైక్రోసాఫ్ట్.

మంచి ఫలితాలు

భారత వ్యవసాయ రంగంలో ఏఐ సమర్థంగా వినియోగిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. పంట దిగుబడులు 20 శాతం పెరగ్గా, ఎరువుల ఖర్చులు 25 శాతం వరకు తగ్గాయి. నీటి వినియోగం 8 శాతం తగ్గిపోయింది. కోత అనంతర వచ్చిన నష్టాలు 12 శాతం తగ్గుముఖం పట్టాయి.

ఒకప్పుడు కరువు, రైతుల అప్పులు, విపరీతంగా పెరిగాయి. దీనికితోడు పురుగుమందుల వినియోగంతో పెట్టుబడి వ్యయాలు అమాంతంగా పెరిగాయి. ఈ క్రమంలో రైతులు ఆత్మహత్యలతో ఈ ప్రాంత దీనస్థితిగా మారింది. తక్కువగా లభించే నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు చేసి చూపించారు. పురుగు మందుల వాడకం బాగా తగ్గించారు. దీనివల్ల ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి వచ్చిందన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల షేర్ చేసిన వీడియోపై టెక్ దిగ్గజాలు రియాక్ట్ అవుతున్నారు.

 

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×