OTT Movie: ఓటిటిలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని పాత సినిమాలు మళ్లీ రిలీజ్ అవుతుంటాయి ఇక మరికొన్ని సినిమాలు వేరే ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రతివారం లెక్కలేనన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బోల్డ్ మూవీస్ లకు ఎక్కువగా డిమాండ్ ఉంటున్న సంగతి తెలిసిందే. శృంగార భరిత సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువ మెచ్చే చిత్రాల్లో హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్సే ఉంటాయి.. ఇప్పుడు తాజాగా మరో కొత్త మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఆ మూవీ ఏంటో? ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతుందో చూడాలి..
మూవీ & ఓటీటీ..
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన జాయ్‌ల్యాండ్. ఇది మన ఇండియా సినిమా కాదు ఇది ఒక పాకిస్తాన్ సినిమా.. సైమ్ సాదిక్ దర్శకత్వం వహించారు. ఇదే ఆయనకు దర్శకుడిగా డెబ్యూ మూవీ. అపూర్వ గురు చరణ్, సమద్ సుల్తాన్ ఖూసత్, సబిహ సుమర్, లారెన్ మన్ నిర్మాతలుగా మారారు. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఈ మూవీలో అలీనా ఖాన్, అలీ జునెజో, రస్తి ఫరూఖ్ , సర్వత్ గిలానీ, సోహైల్ సమీర్, సల్మాన్ పీర్, సానియా సయ్యద్ కీలకపాత్రలు పోషించారు. ఎల్జీబీటీక్యూ కాన్సెప్ట్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ ను మొదటగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. విడుదలకు ముందు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఉర్దూ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ అందుబాటులో ఉంది.
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీలో సలీం, హైదర్ ఇద్దరు అన్నదమ్ములు. హైదర్ కు ముంతాజ్ భార్య. ఆమె జాబ్ చేస్తుంటుంది. కానీ హైదర్ మాత్రం ఖాళీగా ఉండడం తో అందరు చులకనగా చస్తారు. దీంతో అదే సమయంలో బీబా అనే ట్రాన్స్ జెండర్ ప్రేమలో పడతాడు హైదర్. ఆమె మత్తులో పడి అతని భార్యను పూర్తిగా మర్చిపోతాడు.. అతడి భార్య ముంతాజ్ ఏమైందీ ? హైదర్, బీబా లవ్ స్టోరీలో ఏం జరిగింది ? హైదర్ బిబాతో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, రాత్రిళ్ళు బైక్ పై రోడ్ల పై తిరగటం వంటివి చేస్తుంటారు.. అయితే క్రమక్రమంగా హైదర్ కి తన భార్యపై ఫీలింగ్స్ తగ్గుతూ వస్తుంటాయి.. దీంతో ఆమెని దూరం పెడుతుంటాడు.. కానీ బిబా కి మాత్రం రోజు రోజుకి దగ్గరవుతుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగింది.? ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. ఇలాంటి కథల తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల ను బాగా అలరిస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ మూవికీ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఓటీటీ లో ఎలాంటి సినిమాలైన కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.