BigTV English

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలును చూస్తున్నప్పుడు కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అందులోనూ టైమ్ ట్రావెల్ సినిమాలు ఎలా ఉంటాయో, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక స్పానిష్ సైన్స్ ఫిక్షన్ సినిమా, ఓటిటిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీనిని చిన్నపిల్లలు కూడా ఇష్టపడుతారు. ఈ కథ 1989లో అదృశ్యమైన ఒక పిల్లాడు 2022లో టైమ్ ట్రావెల్ ద్వారా తిరిగి వస్తాడు. ఆతరువాత స్టోరీ మరో లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమా ఎమోషనల్, ఫన్నీ అడ్వెంచర్‌ని చూపిస్తూ, ఒక ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..


ఎందులో ఉందంటే

‘జంప్’ (Jump), స్పానిష్ లో (¡Salta!) 2023లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా. దీనికి ఓల్గా ఒసోరియో డైరెక్ట్ చేసింది. ఇందులో తమర్ నోవాస్ (ఓస్కార్), మార్తా నీటో (ఎలెనా), మారియో సాంటోస్ (టియో), రూబెన్ ఫుల్జెన్సియో (చిన్న ఓస్కార్) ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. 1 గంట 25 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb 6.4/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

1989లో ఓస్కార్, అతని తమ్ముడు టియో తమ సైంటిస్ట్ తల్లితో సంతోషంగా ఉంటారు. ఆమె వార్మ్‌హోల్ మీద పరిశోధనలు జరుపుతుంటుంది. ఒక రోజు టియో హఠాత్తుగా, ఒక వార్మ్‌హోల్ ద్వారా అదృశ్యమవుతాడు. ఓస్కార్ జీవితం తల్లి మరణంతో, తమ్ముడి కోల్పోవడంతో చీకటిమయం అవుతుంది. 2022లో ఓస్కార్ సైంటిస్ట్‌గా, తన తమ్ముడి అదృశ్యం గురించి ఇంకా బాధపడుతూ, ఒంటరిగా జీవిస్తుంటాడు. అతను తన చిన్నప్పటి స్నేహితురాలు ఎలెనాని కలుస్తాడు. ఆమె ఓస్కార్‌ని జీవితంలో ముందుకు వెళ్లమని ప్రోత్సహిస్తుంది. ఒక రోజు టియో, 1989 నుండి టైమ్ ట్రావెల్ చేసి, 11 ఏళ్ల బాలుడిగా 2022లో ఓస్కార్ ముందు ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూసి ఓస్కార్ షాక్ అవుతాడు. టియో రాకతో తన తల్లి వార్మ్‌హోల్ పరిశోధనలను తిరిగి చూస్తాడు. అమ్మమ్మ కూడా టియోని చూసి ఎమోషనల్ అవుతుంది.

Read Also : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

ఓస్కార్, ఎలెనా, టియో కలిసి వార్మ్‌హోల్ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. టియో 1989లో ఒక రహస్య ఎక్స్‌పెరిమెంట్ సమయంలో వార్మ్‌హోల్‌లోకి వెళ్లాడని తెలుస్తుంది. అది తల్లి రాసిన ఒక డైరీలో రివీల్ అవుతుంది. ఓస్కార్, టియోని 1989కి తిరిగి పంపడానికి ఒక పోర్టల్‌ని రీక్రియేట్ చేస్తాడు. టియో తిరిగి వెళితే తన తల్లి మరణాన్ని ఆపగలడని నమ్ముతాడు. ఓస్కార్, ఎలెనా, ఆల్బా సహాయంతో, టియోని గతంలోకి పంపే ప్రయత్నంలో ఎమోషనల్ పరిస్థితులను ఎదుర్కొంటాడు. చివరికి టియో గతానికి వెళ్తాడా ? తన తల్లి మరణాన్ని ఆపుతాడా ? ఆ వార్మ్‌హోల్ రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×