OTT Movie : సోషల్ ఇష్యూస్‌ఆధారంగా, ముఖ్యంగా నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తి పొందిన కొన్ని సినిమాలు… గట్టి మెసేజ్‌తో పాటు ఎమోషనల్ ఇంపాక్ట్‌ను అందిస్తాయి. అలాంటి ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్, అదీ చిన్న పిల్లలకు సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ, జర్నలిజం పవర్, సిస్టమ్‌లోని కరప్షన్ వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిన స్టోరీ అయితే మాములుగా ఉండదు. ఈ అంశాలన్నీ ఉన్న మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
Bhakshak అనే ఈ మూవీ 135-నిమిషాల ఫిల్మ్. పుల్కిత్ దర్శకత్వంలో, గౌరీ ఖాన్ – గౌరవ్ వర్మ నిర్మాణంలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందింది. 2024 ఫిబ్రవరి 9న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇందులో భూమి పెడ్నేకర్ (వైశాలీ సింగ్), సంజయ్ మిశ్రా (భాస్కర్ సిన్హా), ఆదిత్య శ్రీవాస్తవ్ (బన్సీ సాహు), సాయి తమ్హంకర్ (జస్మీత్ కౌర్), తనీషా మెహతా (సుధా కుమారీ) తదితరులు నటించారు. సినిమా ముజఫ్ఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేస్ (2018) నుండి స్ఫూర్తి పొందింది. అక్కడ బ్రజేష్ ఠాకూర్ అనే రాజకీయ నాయకుడు నడిపిన షెల్టర్‌లో 34 మైనర్ అమ్మాయిలు అబ్యూస్‌కు గురయ్యారు. ఆ విషయం TISS రిపోర్ట్ ద్వారా బయటపడింది.
కథలోకి వెళ్తే…
వైశాలీ సింగ్ (భూమి పెడ్నేకర్) అనే యువ జర్నలిస్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె బీహార్‌లోని మునవ్వర్ పూర్ అనే చిన్న పట్టణంలో తన సొంత న్యూస్ ఛానల్ “కోషిష్”ను నడుపుతుంది. ఆమె కెమెరా మెన్ భాస్కర్ సిన్హా (సంజయ్ మిశ్రా) సహాయంతో దీన్ని నడుపుతుంది. కానీ స్థానిక సమస్యలను కవర్ చేస్తూ, తక్కువ సంఖ్యలో వీక్షకులతో ఆ ఛానల్ స్ట్రగుల్ అవుతుంది. ఒక రోజు ఆమెకు ఒక టిప్ ద్వారా, బన్సీ సాహు (ఆదిత్య శ్రీవాస్తవ్) నడిపే బాలికా సేవా గృహ అనే షెల్టర్ హోమ్‌లో జరుగుతున్న దారుణమైన చైల్డ్ అబ్యూస్ గురించి తెలుస్తుంది.
ఈ షెల్టర్‌లో 7-17 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలనే టార్గెట్ చేసి, దారుణాలకు ఒడిగడతారు. ఈ విషయాన్ని ఒక రిపోర్ట్ రివీల్ చేస్తుంది. దీంతో వైశాలీ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తుంది. కానీ బన్సీ సాహు ఒక శక్తివంతమైన లోకల్ పొలిటీషియన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మంత్రి రాజనీ సింగ్ (విభా ఛిబ్బర్) భర్త బ్రిజ్‌మోహన్ సింగ్ (ప్రవీణ్ కుమార్ సిసోడియా) సహాయంతో, సిస్టమ్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఈ క్రమంలోనే వైశాలీకి బెదిరింపులు, ఆమె కుటుంబంపై దాడులు జరుగుతాయి.
Read Also : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …