BigTV English

Hydrating Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌లు వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Hydrating Face Pack: ఈ ఫేస్ ప్యాక్‌లు వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

Hydrating Face Pack: ముఖ చర్మాన్ని హైడ్రేట్ చేయడం , తేమగా ఉంచడం ముఖం. ఇది చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మెరుపును కూడా పెంచుతుంది. చర్మానికి హైడ్రేషన్ అత్యంత ముఖ్యమైన అంశం. ఎందుకంటే శరీరంలో తగినంత నీరు లేనప్పుడు.. చర్మం పొడిగా మారుతుంది. అంతే కాకుండా నిర్జీవంగా మారి అలసిపోయినట్లు కనిపిస్తుంది.


హైడ్రేటింగ్ ఫేస్ ప్యాక్‌లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. అంతే కాకుండా ఇది తాజాగా ,ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఇలాంటి ఫేస్ ప్యాక్‌లను కొనడానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే సహజ పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

మీ చర్మం పొడిగా, అలసిపోయినట్లు కనిపించినప్పుడు ఈ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల మీ చర్మం తాజాగా , యవ్వనంగా ఉంటుంది. అంతే కాకుండా క్షణాల్లోనే మెరిసిపోతుంది.


1. టమాటో, పాలతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
టమాటో గుజ్జు- 2 టేబుల్ స్పూన్లు
పాలు- 2 టీస్పూన్లు

తయారీ విధానం:
ముందుగా టమోటా గుజ్జును తీసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి. తర్వాత దానికి పైన తెలిపిన మోతాదులో పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 20-25 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రం చేయండి.

టమాటోలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటాయి. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతం మారుస్తుంది. పాలు చర్మానికి తేమను అందించి మృదువుగా మారుస్తాయి.
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది.

2. అరటిపండు, ఓట్స్ ఫేస్ ప్యాక్ :
కావాల్సినవి:
పండిన అరటిపండు-1
ఓట్స్ పౌడర్- 2 స్పూన్

ముందుగా అరటిపండును మెత్తగా చేసి పేస్ట్ లా చేయండి. తర్వాత దీనికి ఓట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 18-22 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.

అరటిపండు, ఓట్స్ రెండూ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి , మృదువుగా చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాకుండా అరటిపండు సహజ తేమను కలిగి ఉంటుంది. ఓట్స్ మన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, మృదువుగా , ప్రకాశవంతంగా మారుస్తుంది.

ఈ ప్రత్యేక ఫేస్ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా రిఫ్రెష్ చేస్తుంది. ఈ ప్యాక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Also Read: చాక్లెట్ ఫేస్ మాస్క్‌తో.. గ్లోయింగ్ స్కిన్

3. పెరుగు , తేనె ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
పెరుగు- 2 స్పూన్లు
తేనె- 1 టీస్పూన్

ఒక గిన్నెలో పైన తెలిపిన మోతాదులో పెరుగు, తేనె బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద బాగా అప్లై చేయండి.
20-25 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.

పెరుగు, తేనె రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. పెరుగు తేమను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా తేనె ఒక సహజ హ్యూమెక్టెంట్. ఇది చర్మంలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకుంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×