OTT Movie : కామెడీ సినిమాలకు ప్రేక్షకులందరూ గులామ్ అవుతుంటారు. భాషతో ప్రమేయం లేకుండా వీటిని చూస్తూ రిలాక్స్ అవుతుంటారు. మీ మైండ్ ని రిఫ్రెష్ చేసే ఒక బాలీవుడ్ మూవీ, డార్క్ కామెడీతో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. ఈ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా దీపావళి రాత్రి ఒక జంట ఇంట్లో జరిగే పార్టీలో అనూహ్య సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా హాలీవుడ్ దర్శకుడు అల్ఫ్రెడ్ హిచ్కాక్ డైరెక్షన్ లో వచ్చిన రోప్ సినిమా నుండి స్ఫూర్తి పొందింది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘కడఖ్’ (Kadakh) 2019లో విడుదలైన హిందీ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా. దీనికి రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, మాన్సీ ముల్తానీ, కల్కి కొచ్లిన్, సైరస్ సహూకర్, శ్రుతి సేథ్, రజత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 48 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDb లో 6.9/10 రేటింగ్ ను పొందింది. జూన్ 18, 2020న SonyLIVలో రిలీజ్ అయ్యింది. SonyLIV, Amazon Prime Video, Airtel Xstream Playలో హిందీ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. 2019 సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రీమియర్ అయ్యింది.
కథలోకి వెళ్తే
ముంబైలో సునీల్, మాలతి అనే ఒక మధ్యతరగతి జంట దీపావళి సందర్భంగా, తమ ఇంట్లో పార్టీని ఏర్పాటు చేసే సన్నాహాలలో ఉంటుంది. సునీల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డోర్‌బెల్ మోగుతుంది. రాఘవ్ అనే ఒక అపరిచిత వ్యక్తి, తనను తాను చాయా భర్తగా పరిచయం చేసుకుంటాడు. చాయా సునీల్ సహోద్యోగి. అతనితో సునీల్‌కు వివాహేతర సంబంధం ఉంటుంది. రాఘవ్ ఈ విషయం తెలుసుకుని, సునీల్‌తో మాట్లాడడానికి వస్తాడు.
సునీల్ మర్యాదగా రాఘవ్‌ను ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. కానీ మాటామాటా పెరిగి, పరిస్థితి అదుపుతప్పుతుంది. రాఘవ్ ఈ అక్రమ సంబంధం గురించి అసౌకర్యమైన అడుగుతాడు. దీనివల్ల సునీల్ ఇబ్బంది పడతాడు. ఇక మాటలు పెరిగి రాఘవ్ తన బ్యాగ్ నుండి ఒక తుపాకీ తీసి సునీల్‌పై గురిపెడతాడు. ఈ సన్నివేశంలో, రాఘవ్ అనుకోకుండా తనను తాను కాల్చుకుని చనిపోతాడు. గోడపై రక్తం చిమ్ముతుంది. ఈ సంఘటన సినిమాలో కీలకమైన మలుపు తీసుకుంటుంది.
సునీల్ ఈ షాకింగ్ సంఘటనను ఎలా ఎదుర్కోవాలో తెలియక గందరగోళంలో ఉంటాడు. ఈ సమయంలో, అతని భార్య మాలతి ఆఫీసు నుండి తిరిగి వస్తుంది. సునీల్ ఆమెకు జరిగిన దానిని వివరిస్తాడు. వీళ్ళు ఈ శవాన్ని ఏం చేయాలో చర్చిస్తూ ఉండగా, దీపావళి పార్టీకి అతిథులు ఒక్కొక్కరుగా వచ్చేందుకు సిద్ధమవుతారు. ఇప్పుడు సునీల్, మాలతి ఈ శవాన్ని దాచడానికి ప్రయత్నిస్తూనే, తమ అతిథులను చూసుకోవాల్సివస్తుంది.
ఇప్పుడు పార్టీ డార్క్ కామెడీతో ప్రారంభమవుతుంది. సునీల్, మాలతి శవాన్ని దాచడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో పార్టీని సాధారణంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఒక దశలో, శవం పార్టీలో ఒక జోక్‌గా కూడా మారుతుంది. ఇది డార్క్ కామెడీలో హైలైట్ గా ఉంటుంది. చివరికి ఈ శవం ఏమవుతుంది ? ఈ జంట ఈ ఘటన నుంచి బయట పడుతుందా ? ఎవరైనా ఈ శవాన్ని గుర్తిస్తారా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?