OTT Movie : మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇప్పుడు వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసి, గతంలో చూడకుండా మిస్ అయిన స్టోరీలను వెతికి మరీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి చెప్పుకోవాలి. 2 గంటల 45 నిమిషాల ఈ సినిమా, జోసెఫ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. జోసెఫ్ పాత్రలో జోజు జార్జ్ అద్భుతంగా నటించాడు. జోజు జార్జ్‌కి 2018 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ (బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్), నేషనల్ అవార్డ్స్‌లో స్పెషల్ మెన్షన్ వచ్చాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
ఎందులో ఉందంటే
‘జోసెఫ్’ (Joseph) ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి ఎం. పద్మకుమార్ డైరెక్ట్ చేయగా, షాహి కబీర్ దీనిని రచించారు. ఇందులో జోజు జార్జ్ (జోసెఫ్), దిలీష్ పోతన్ (పీటర్), అత్మీయ రాజన్ (స్టెల్లా) నటించారు. IMDbలో ఈ సినిమా 8.0/10 రేటింగ్ పొందింది. 2018 నవంబర్ 16న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. Amazon Prime Video, Google Play Movies, YouTube లో మలయాళం ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. తెలుగులో ఈ సినిమా ‘శేఖర్’ పేరుతొ రీమేక్ అయింది.
స్టోరీలోకి వెళ్తే
జోసెఫ్ (జోజు జార్జ్)ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్నవాడు. అతను ఒంటరిగా, మద్యంతో, సిగరెట్‌తో జీవిస్తుంటాడు. అతని భార్య స్టెల్లా (అత్మీయ రాజన్) నుంచి జోసెఫ్ విడిపోయి ఒంటరిగా ఉంటాడు. ఆమె పీటర్ (దిలీష్ పోతన్) అనే వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంది. జోసెఫ్ గతంలో ఒక కేసులో తన మాజీ ప్రేమికురాలు లిసమ్మ (మాళవిక మీనన్) మృతదేహాన్ని చూసి షాక్ అవుతాడు. ఈ సమయంలో అతని కూతురు కూడా చనిపోతుంది. ఈ రెండు మరణాల వల్ల అతను మద్యానికి బానిస అవుతాడు. ఇక అతనితో ఉండలేక స్టెల్లా విడిపోయిఉంటుంది. ఒక రోజు స్టెల్లా యాక్సిడెంట్‌లో గాయపడినట్లు తెలుస్తుంది. జోసెఫ్ ఆమెను చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తాడు. కానీ స్టెల్లా బ్రెయిన్ డెడ్ అవుతుంది. ఆమె ఆర్గాన్స్ డొనేట్ చేయమని పీటర్ సంతకం చేస్తాడు. జోసెఫ్, స్టెల్లా యాక్సిడెంట్‌పై అనుమానిస్తాడు.
తన స్నేహితుల సహాయంతో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. యాక్సిడెంట్ కారు నెంబర్ ఫేక్ అని, స్టెల్లా గాయాలు హిట్-అండ్-రన్‌కి సరిపోవని గుర్తిస్తాడు. జోసెఫ్ ఒక ఆర్గాన్ ట్రాఫికింగ్ రాకెట్‌ని కనిపెట్టడానికి, సెకండ్-హ్యాండ్ కార్లను, కొత్త SIM కార్డ్ లింక్‌లను ట్రాక్ చేస్తాడు. ఈ క్రమంలో అతను రేణుక అనే అమ్మాయిని కలుస్తాడు. ఆమె కూతురుకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అయింది. కానీ ఆమె కూడా హఠాత్తుగా చనిపోతుంది. జోసెఫ్ ఈ క్రైమ్ రాకెట్‌ని బయటపెట్టడానికి తన లైఫ్ ని రిస్క్ చేస్తాడు. క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ రివీల్ తో అసలు విషయం బయటపడుతుంది. క్లైమాక్స్‌లో బయట పడే నిజం ఏమిటి ? జోసెఫ్ లైఫ్ ని ఎలాంటి రిస్క్ లో పెడతాడు ? అమ్మాయిల ఆర్గాన్స్ అమ్ముకుంటున్నది ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే