OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సినిమాలు థియేటర్లలో పాటు, ఓటీటీలో కూడా టాప్ లేపుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రియల్ ఇన్సిడెంట్ తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమాని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో చూసి “సత్యం బయటకొచ్చింది” అని ట్వీట్ చేసి ప్రశంసించారు కూడా. ఇది సినిమాకి జాతీయ గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా జర్నలిజం నేపథ్యంలో ఎమోషనల్‌గా సాగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) 2002 గోధ్రా రైలు దహన ఘటన ఆధారంగా తీసిన హిందీ పొలిటికల్ డ్రామా-థ్రిల్లర్. ధీరజ్ సర్నా డైరెక్షన్‌లో, విక్రాంత్ మాస్సీ (సమర్ కుమార్), రాశి ఖన్నా (అమృత గిల్), రిద్ధి డోగ్రా (మణిక రాజ్‌పురోహిత్) అద్భుతంగా నటించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, వికిర్ ఫిల్మ్స్ నిర్మించిన 2 గంటల 7 నిమిషాల ఈ సినిమా, రాజకీయ ఒత్తిళ్లు, మీడియా గేమ్స్ మధ్య నిజాన్ని బయటపెట్టే కథతో ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. IMDb లో 8.2/10 రేటింగ్ ను కూడా పొందింది. ఈ సినిమా 2024 నవంబర్ 15న థియేటర్లలో రిలీజ్ అయ్యి, 2025 జనవరి 10 నుంచి ZEE5లో హిందీ, తెలుగు, తమిళ ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. JioTVలో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళ్తే
సమర్ కుమార్ EBT న్యూస్‌లో కెమెరామెన్‌గా పనిచేసే ఒక జర్నలిస్ట్. 2002లో గోధ్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు కాలిపోయి, 59 మంది చనిపోయిన ఘోర ఘటనను కవర్ చేయడానికి అతన్ని సీనియర్ యాంకర్ మణిక రాజ్‌పురోహిత్ తో పంపిస్తారు. గోధ్రాలో కాలిన శవాలు, రక్తం చూసి సమర్ షాక్ అవుతాడు. ఇది యాక్సిడెంట్ కాదు, పక్కాగా ప్లాన్ చేసిన దాడి! అని అతను తెలుసుకుంటాడు. కానీ మణిక, రాజకీయ ఒత్తిళ్లతో, నకిలీ రిపోర్ట్ ఇస్తుంది. సమర్ వెలుగులోకి తెచ్చిన నిజమైన రిపోర్ట్‌ని అణచివేస్తారు. దీంతో సమర్‌ని జాబ్ నుంచి కూడా తీసేస్తారు. దీనివల్ల అతని లైఫ్ తల్లకిందులవుతుంది. అతను మద్యానికి బానిసై, చిన్న చిన్న ఉద్యోగాలతో బతుకుతాడు.
ఐదేళ్ల తర్వాత అమృత గిల్ అనే ఒక యువ జర్నలిస్ట్ సమర్‌ని కలిసి, గోధ్రా ఘటన వెనక దాగిన నిజాన్ని బయటపెట్టమని కోరుతుంది. సమర్ గతంలో సేకరించిన రిపోర్ట్‌లు, ఇంటర్వ్యూలతో వాళ్లిద్దరూ కలిసి ఈ కుట్రను బట్టబయలు చేస్తారు. పవర్‌ఫుల్ పొలిటీషియన్స్, మీడియా హౌసెస్ వాళ్లను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ సమర్, అమృత పట్టుదలతో ముందుకు సాగుతారు. చివర్లో వాళ్లు ఈ ప్రమాదం వెనుక నిజాన్ని ప్రపంచానికి చూపిస్తారు. గోధ్రా బాధితులకు న్యాయం కోసం తమ జీవితాలను పణంగా పెడతారు. ఈ కథ జర్నలిస్ట్ లు చేసే పోరాటాన్ని, ఎమోషనల్‌గా సస్పెన్స్‌తో చూపిస్తుంది.
Read Also : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా